హరీష్ రావు , కెసిఆర్ ల పై విరుచుకుపడ్డ విజయశాంతి, ట్విస్ట్

బిజెపి నేత విజయశాంతి, హరీష్ రావు ,కేసీఆర్ ల పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న భూముల అమ్మకం లో అక్రమాలు జరుగుతున్నాయంటూ టిఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు విజయశాంతి. వివరాల్లోకి వెళితే..

విజయశాంతి సోషల్ మీడియా లో ట్వీట్ చేస్తూ, ” తెలంగాణ భూముల అమ్మకం పై ఆర్థికమంత్రి హరీష్ రావు గారి వాదన చాలా అసంబద్ధంగా ఉంది. గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలి. మరి, ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఏంది? అప్పుల పాలు చేసినం మన తెలంగాణ రాష్ట్రాన్ని… అని మీ సీఎం గారు ఒప్పుకుని ఇందుకు క్షమాపణ చెప్పి తీరాలి. ఈ విషయమై ప్రజలు ఉద్యమాలకు తప్పక సమాయత్తమవుతారు. ఠికానా లేక భూములమ్మే కాడికి తెచ్చిన మీకు, ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? ఉన్న జైళ్ళు కూల్చుడెందుకు? కోట్ల రూపాయల వృధా పబ్లిసిటీ ఖర్చులెందుకు? సెక్రెటేరియట్‌కే రాని సీఎం గారికి కొత్త భవనాలెందుకు?” అని రాసుకొచ్చారు.

అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే, విజయశాంతి టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందు తెలంగాణ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీని నడపలేక, ఆ పార్టీ తరఫున ఒక్క వార్డు లోనూ గెలవలేక సతమతమవుతున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ లోకి విజయశాంతిని తీసుకువచ్చింది హరీష్ రావే. విజయశాంతి టిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ వెళ్ళిపోయిన కొత్తలో ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ స్వయంగా అప్పట్లో ఈ విషయాన్ని తెలిపారు. హరీష్ రావు కారణంగానే విజయశాంతి ని టిఆర్ఎస్ లోకి తీసుకున్నామని ఆయన అన్నారు. ఇక విజయశాంతి కూడా టిఆర్ఎస్ లో ఉన్నంతకాలం కేసీఆర్ కి చెల్లెలిని అంటూ హడావుడి చేశారు. ఇప్పుడేమో హరీష్ రావు కేసీఆర్ ల పై ఆవిడ చెలరేగిపోతున్నారు. మరి హరీష్ రావు విజయశాంతి వ్యాఖ్యలకు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

ఎడిటర్స్ కామెంట్ : “ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్” ..

"ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్" .. హెన్సీ కేట్ అనే పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన రాజకీయ పండితులు చేసిన వ్యాఖ్య ఇంది. దశాబ్దాలు...

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

HOT NEWS

[X] Close
[X] Close