బోయ్ తెలుసు.. గాళ్ తెలుసు.. `బాయ్ కాట్` ఎవ‌రు?

ఈమ‌ధ్య ‘బాయ్ కాట్‌’ బెంగ ప‌ట్టుకొంది సినిమా వాళ్ల‌కు. ఎవ‌రి మ‌నోభావాలు ఎప్పుడు దెబ్బ తింటాయో తెలీదు. ఎవ‌రు ఏ సినిమాని ఎందుకు బాయ్ కాట్ చేస్తారో అస్స‌లు తెలీదు. బాలీవుడ్‌లో ఈ సంస్క్రృతి ఎక్కువైంది. అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చ‌ద్దాని బాయ్ కాట్ చేశారు. అంత‌కు ముందు కంగ‌నా ర‌నౌత్ సినిమాల‌కూ బాయ్ కాట్ పిలుపు నిచ్చారు. బాయ్ కాట్ ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా మాట్లాడినందుకు ‘లైగ‌ర్‌’ని కూడా బాయ్ కాట్ చేస్తామ‌ని బెదిరించింది ఓ వ‌ర్గం. అయితే వాళ్లెవ‌రూ బాయ్ కాట్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండానే ఆ సినిమా స‌ర్దేసుకుంది. అందుకే బాయ్ కాట్ ఉద్య‌మం గురించి ఏం మాట్లాడాల‌న్నా.. భ‌య ప‌డుతున్నారు సినిమా వాళ్లు.

‘కోబ్రా’ ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్ వ‌చ్చాడు విక్ర‌మ్‌. ఈ సంద‌ర్భంగా బాయ్ కాట్ గురించిన ప్ర‌శ్న విక్ర‌మ్ కి ఎదురైంది. ”ఈమ‌ధ్య బాయ్ కాట్ అంటూ సినిమాల్ని బ‌హిష్క‌రిస్తున్నారు క‌దా, ఓ సినిమా వాడిగా మీ అభిప్రాయం ఏమిటి“ అంటే… విక్ర‌మ్ అమాయ‌కంగా ”నాకు బాయ్ తెలుసు, గాళ్ ఇంకా బాగా తెలుసు. ఈ బాయ్ కాట్ ఎవ‌రు” అని ప్ర‌శ్నించాడు. దాన్ని బ‌ట్టి ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం విక్ర‌మ్ కి ఎంత మాత్రం ఇష్టం లేద‌న్న విష‌యం అర్థ‌మైపోయింది. గ‌త కొన్నేళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న విక్ర‌మ్ ఈ సారి ఎలాగైనా త‌న‌ని తాను నిరూపించుకోవాల‌నుకుంటున్నాడు. త‌న ఆశ‌ల‌న్నీ ‘కోబ్రా’పైనే. ఈనెల 31న ఈచిత్రం విడుద‌ల అవుతోంది. ఈ సినిమాపై ఎలాంటి నెగిటీవ్ ఎఫెక్ట్ ప‌డ‌కూడ‌ద‌ని విక్ర‌మ్ భావిస్తున్నాడు. అందుకే వివాదాస్ప‌ద అంశాల జోలికి వెళ్ల‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close