ఎక్స్‌క్లూజీవ్‌: ‘విక్ర‌మార్కుడు 2’ క‌థ రెడీ!

రాజ‌మౌళి విజ‌య ప‌రంప‌ర‌లో `విక్ర‌మార్కుడు`ది ప్ర‌త్యేక‌మైన స్థానం. ర‌వితేజ – రాజ‌మౌళి కాంబో.. ప్రేక్ష‌కుల చేత జింతాత ఆడించేసింది. ఈ సినిమా విడుద‌లై… దాదాపు 15 ఏళ్లు అయ్యింది. విక్ర‌మ్ రాథోడ్ గా బాలీవుడ్ కి వెళ్లి అక్క‌డ కూడా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించుకుంది. ఇంత కాలానికి ఈ సినిమా సీక్వెల్ కోసం ఓ క‌థ రెడీ చేశారు. ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ విక్ర‌మార్కుడు సీక్వెల్ కి స‌రిప‌డా క‌థ రెడీ చేశారు. అయితే… ఈ క‌థ రాజ‌మౌళి చేసే అవ‌కాశం లేదు. ఎందుకంటే ఆయ‌న వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ. ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత మ‌హేష్ తో సినిమా ఉంటుంది. అంటే రాజ‌మౌళి ఖాళీ అవ్వ‌డానికి మ‌రో రెండేళ్లు ప‌డుతుంది. అంఉద‌కే మ‌రో ద‌ర్శ‌కుడికి ఈ క‌థ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అందించ‌నున్నార‌ని టాక్‌. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది తెలియాల్సివుంది. పాన్ ఇండియా స‌బ్జెక్టుకు కావ‌ల్సిన స‌రుకు విక్ర‌మార్కుడు 2లో ఉంద‌ని తెలుస్తోంది. విక్ర‌మార్కుడుసినిమాని అప్ప‌ట్లో హిందీతో పాటుగా అన్ని భాష‌ల్లోనూ రీమేక్ చేశారు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమానే తెర‌కెక్కించాల‌న్న‌ది ఆలోచ‌న‌. ప్ర‌స్తుతానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ తో కొన్ని అగ్ర నిర్మాణ సంస్థ‌లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాయి. ఈ క‌థ‌ని ఆయ‌న ఏ ద‌ర్శ‌కుడి చేతిలో పెడ‌తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇరుక్కుపోనున్న వైసీపీ !

వైసీపీకి తెలంగాణ పెద్ద చిక్కుముడిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో వైసీపీ లేదు. కానీ ఆ పార్టీకి కొంచెం ఓటు బ్యాంక్ ఉంది. ...

మునుగోడులో కాంగ్రెస్ కు మేలు చేసేలా టీఆర్ఎస్ ప్లాన్ !?

" మునుగోడు ఉపఎన్నిక చిన్నదే. దాని వల్ల వచ్చేదేం ఉండదు.. పోయేదేం ఉండదు " అని మంత్రి కేటీఆర్ ఇటీవల నెటిజన్లతో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు...

మాధవ్ ఫిర్యాదు మీదే విచారణ చేస్తున్నారట !

న్యూడ్ వీడియో విషయంలో ఎంపీ మాధన్‌ను రక్షించడమే కాదు.. బాధితుడిగా చూపించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశం ఎంతకీ సద్దుమణగకపోతూండటం .. విచిత్రమైన రియాక్షన్స్‌తో అందరూ ప్రజల దృష్టిలో చులకన అవుతూండటంతో...

ఖాళీగా ఉన్న నేతలందరికీ బీజేపీ నుంచి ఆహ్వానాలు !

తెలంగాణలో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని చెప్పడానికో .. లేకపోతే సీనియర్ నేతల అవసరం ఉందనుకుంటున్నారో కానీ తెలంగాణలో ఖాళీగా ఉన్న నేతలందరికీ బీజేపీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. చేరికల కమిటీ చైర్మన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close