హైదరాబాద్ ప్రజల అభిరురుచులు మారుతున్నాయి. అయితే విల్లా లేకపోతే ఆకాశహర్మ్యాల్లో నివాసం ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఏపీ రాజధానిలోనూ కనిపిస్తోంది. విల్లా ప్రాజెక్టులను విస్తృతంగా నిర్మిస్తున్నారు. అపార్టుమెంట్ల ఎత్తు కూడా అంతకంతకూ పెరుగుతోంది.
రెసిడెన్షియల్ విల్లాలు, లగ్జరీ విల్లాలు ,విల్లా ప్లాట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇరవై ఐదు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రాజెక్టులను జోరుగా కొనసాగిస్తున్నాయి.
హైదరాబాద్లో విల్లాల నిర్మాణంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వెర్టెక్స్ గుంటూరు, విజయవాడ మధ్యలో ఓ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. అలాగే లింగమనేని పలు సంస్థలు నిర్మాణంలోకి దిగాయి. అపర్ణ వంటి సంస్థలు హై రైజ్ అపార్టుమెంట్లను నిర్మించాయి. చాలాకంపెనీలు.. మొదటి సారి అమరావతిని రాజధానిగా ఖరారు చేసినప్పుడే.. నిర్మాణాలు ప్రారంభించాయి. కానీ జగన్ కారణంగా .. ఐదు సంవత్సరాల పాటు ఆ కంపెనీలు తమ పెట్టుబడిని కోల్పోయాయి. ఫలితంగా రామకృష్ణ వెనుజుయా వంటి మంచిప్రాజెక్టులు దివాలా స్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు వాటికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి.
ప్రస్తుతం ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి కొన్నిచోట్ల బిల్డర్లు విల్లాలను రూ. కోటికే అందిస్తున్నారు. హైరైజ్ అపార్టుమెంట్లలో రూ. కోటి పెడితే విశాలమైన అపార్టుమెంట్ లభిస్తోంది. హైదరాబాద్ తో పోలిస్తే.. దాదాపుగా ముఫ్పై శాతం వరకూ తక్కువ ధరకు గుంటూరు, విజయవాడ మధ్య ఇళ్లు, అపార్టుమెంట్లు లభిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఆస్తి లేదా ఇల్లు ఉండాలనుకునేవారికి.. కొనుగోలుకుఇదే మంచి సమయం అని అనుకోవచ్చు.