హైదరాబాద్లో కాస్త స్థిరపడ్డ కుటుంబాల ఆశ.. శివారుకు వెళ్లి అయినా మంచి విల్లాలో ప్రశాంతమైన జీవితం గడపడం. గతంలో లక్షల్లోనే అందుబాటులో ఉన్న విల్లాలు ఇప్పుడు కోటి దాటిపోయాయి. అందుకే అదంతా ఉన్నత వర్గాల వారికీ అందుబాటులో ఉన్న సౌకర్యంగా భావిస్తూ వస్తున్నారు. అయితే కోటి రూపాయలు పెట్టగలిగే వారికీ ఇప్పుడు విల్లాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.
ఘట్కేసర్ ప్రాంతంలో 80 లక్షల నుండి 1 కోటి రూపాయల లోపు విల్లాలు లభిస్తున్నాయి. ఈ ప్రాంతంలో 2 BHK , 3 BHK విల్లాలు, సాధారణంగా 900 నుండి 1485 చదరపు అడుగుల విస్తీర్ణంతో, గేటెడ్ కమ్యూనిటీలలో అందుబాటులో ఉన్నాయి. పటాన్చెరులో 78 లక్షల నుండి 99 లక్షల రూపాయల ధరలో 3 BHK విల్లాలు అందుబాటులో ఉన్నట్లుగా బ్రోకర్లు చెబుతున్నారు. ముంబై హైవేపై ఉండే బీరంగూడలో 3 BHK విల్లాలు 78 లక్షల నుండి 1 కోటి రూపాయల లోపు అందుబాటులో ఉన్నాయి.
ఇక కొంపల్లిలో కూడా 1 కోటి రూపాయల లోపు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు అందుబాటులో ఉన్నట్లుగా బ్రోకర్లు చెబుతున్నారు. బాలాపూర్, రాంపల్లి గండిమైసమ్మ , పటాన్ చెరు సమీపంలోని ఇంద్రేశం, బొడుప్పల్ హయత్నగర్, వంటి. ప్రాంతాలలో మధ్యస్థ బిల్డర్లు నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో కోటిలోపే అమ్ముతున్నారు. అయితే రూ. కోటి లోపు ధర అంటే కొన్ని సౌకర్యాల విషయంలో రాజీ పడాల్సి ఉంటుందని అక్కడి రియల్ బ్రోకర్లు చెబుతున్నారు.
ఇలా కోటి లోపు లభించే విల్లాలు అత్యధికంగా 2BHKనే ఉంటున్నాయి. త్రీ BHK అయితే డూప్లెక్స్ ఉంటుంది. అందుకే విల్లా సౌకర్యాల కోసం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అలాంటి సౌకర్యాలు చూసుకుని కొనుగోలు చేయడం మంచిది.