రివ్యూ : విన‌రో భాగ్యము విష్ణుక‌థ‌

Vinaro Bhagyamu Vishnu Katha Movie Telugu Review

రేటింగ్‌: 2.75/5

చిన్న, మీడియం సినిమాల వైపు ప్రేక్షకుడి దృష్టి మళ్ళాలి అంటే ఒకటే మార్గం.. టీజర్ ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేయాల్సిందే. ‘ఇదేదో బావుందే’ అనే క్యురియాసిటీని కలిగించాలి. ఈ మధ్య కాలంలో అంత ఆసక్తి కలిగించిన ప్రమోషనల్ మెటిరియల్ లో కిర‌ణ్ అబ్బవ‌రం ‘విన‌రో భాగ్యము విష్ణుక‌థ‌’ ఒకటి. టీజర్, ట్రైలర్ ఆసక్తి కలిగించడం, గీతా ఆర్ట్స్‌2 బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో విష్ణుక‌థ‌ పై ఆసక్త పెరిగింది. మారా ఆసక్తి సినిమాలో కొనసాగిందా ? మహాశివ రాత్రికి వచ్చిన ఈ విష్ణుకథ ఏంటి ?

విష్ణు(కిర‌ణ్ అబ్బవ‌రం) తిరుప‌తి కుర్రాడు. చాలా మంచోడు. పొరుగు వాడికి సాయ పడటంలో ముందుంటాడు. తన శక్తికి మించి సాయం చేయడానికి కూడా వెనకడుగు వేయడు. ద‌ర్శన (క‌శ్మీరా) ఓ యూట్యూబ‌ర్‌. సెలబ్రిటీ కావాలని తపించే దర్శన నంబ‌ర్ నైబ‌ర్ కాన్సెప్ట్ ద్వారా విష్ణు, మార్కేండేయ శ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ)ల‌ని కలుస్తుంది. యూట్యూబ్ లో పాపులర్ కావాలంటే సంచలనమైన కంటెంట్ కావాలని సలహా ఇస్తాడు శర్మ. దర్శన శర్మ కలసి సాంగ్ కవర్ లు చేస్తారు. దీంతో దర్శన ఛానల్ పాపులర్ అవుతుంది. ఇదే సమయంలో ద‌ర్శనకి మరో క్రేజీ ఐడియా వస్తుంది. శ‌ర్మతో క‌లిసి లైవ్ మ‌ర్డర్ అనే ప్రాంక్ వీడియోని ప్లాన్ చేస్తుంది ద‌ర్శన. అయితే ప్రాంక్ కాస్త నిజమైపోతుంది. డుప్లికేట్ అని భావించి కాల్చిన గన్ నుంచి వచ్చిన రియల్ బుల్లెట్ తగిలి శర్మ ప్రాణాలు కోల్పోతాడు. దీంతో దర్శన జైలు పాలౌతుంది. అయితే ఈ కేసులో విష్ణుకి ఓ సంచలనమైన నిజం తెలుసుతుంది. ఏమిటా నిజం ? ప్రాంక్ వికటించడానికి కారణం ఏమిటి ? అసలు శర్మ చంపాల్సిన అవసరం ఎవరికి వుంది ? ఈ కేసులో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూశాయి ? అనేది మిగతా కథ.

కొత్త దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు. ప్రేక్షకులని ఎంగేజ్ చేయడమే పరమావధిగా కొన్ని కథలు తయారు చేసుకుంటున్నారు. అలాంటి ప్రయత్నం వచ్చిన కథే విన‌రో భాగ్యము విష్ణుక‌థ‌. ఈ కథలో రెండు మూడు లేయర్లు వున్నాయి. ‘’కాన్సెప్ట్‌తో మొదలై.. లవ్వూ, కామెడీ మిక్స్‌ అయి, క్రైమ్‌ నుంచి సస్పెన్స్‌ వైపు సాగే ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా’ ఈ సినిమా టీజర్ వాడిన మాటిది. టీజర్ లో వాడటం మర్చిపోయారు కానీ ఇందులో దేశభక్తి కూడా వుంది. ఈ కథని విష్ణు కోణంలో చెబితే ఇందులో దేశభక్తి ఎలిమెంట్ కూడా కనిపిస్తుంది. తన మంచితనం, సాయం చేసే గుణంతో ఓ కుర్రాడు.. ఎన్ఐఎ కి ఎలా సాయపడ్డాడనే అనే పాయింట్ కూడా ఇందులో వుంది.

రాజన్ అనే గ్యాంగ్ స్టార్ ని ని ఎన్ఐఎ పట్టుకోవడానికి ప్రయత్నించడంతో ఈ కథమొదలౌతుంది. తర్వాత నైబర్ నెంబర్ కాన్సెప్ట్ తో రాజన్ దగ్గరకి వచ్చి తన కథ చెప్పుకుంటాడు విష్ణు. విష్ణు తో పాటు దర్శన, శర్మ పాత్ర పరిచయం.. కూతురు వయసు వుండే దర్శనతో శర్మ చేసే డ్యాన్సులు ఇవన్నీ సరదాగా వుంటాయి. అయితే ఇందులో అసలు కథ ఇంటర్వెల్ వరకూ కానీ ప్రారంభం కాదు. శర్మని,దర్శన గన్ తో షూట్ చేసే ఎపిసోడ్ విష్ణు కథపై చాలా ఆసక్తిని పెంచేస్తుంది. ఇంటర్వెల్ బాంగ్ ని థ్రిల్లింగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ పై చాలా అంచనాలు పెరుగుతాయి.

ఫస్ట్ హాఫ్ త పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో కథలో మంచి మలుపులు కుదిరాయి. ప్రాంక్ మర్డర్ కి సంబధించిన కొన్ని వాస్తవాలు విష్ణు తెలుసుకోవడం, నైబర్ నెంబర్ కాన్సెప్ట్ తో అసలు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం, విష్ణు పై జరిగిన దాడి..అటు రాజన్ ఎపిసోడ్ .. ఇవన్నీ అసలు ఈ కథని ఎలా ముగిస్తారో అనే ఆసక్తిని కలిగించాయి. ఇలాంటి కథల్లో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లో బలంగా వుండాలి. ఇందులో కూడా ఒక ట్విస్ట్ వుంది కానీ .. అది మరీ కామెడీగా సిల్లీగా అనిపిస్తుంది. ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ విష్ణు కథని వినడం, నెంబర్ నైబర్ కాన్సెప్ట్ కి పడిపోవడం.. సినిమాటిక్ లిబార్టీ అనుకోవడమే తప్పితే అందులో సహజత్వం వుండదు. చివర్లో భారీ దేశభక్తి డైలాగులతో కథ ముగుస్తుంది. అన్నటు దీనికి పార్ట్ 2 కూడా వుందని హింట్ ఇచ్చారు.

కిరణ్ అబ్బవరం తెరపై చాలా సహజంగా కదులుతాడు. ఇందులో కూడా అదే స్టయిల్ కనిపించింది. రెండు మాస్ ఫైట్లు కూడా చేశాడు. చిత్తూరు యాసలో చెప్పిన డైలాగులు బావున్నాయి కానీ యాసలో కంటిన్యూటీ మిస్ అయ్యింది. కాశ్మీర అందంగా వుంది. మురళిశర్మ కీలకమైన పాత్ర దక్కింది. ఆ పాత్రలో ఆయన వుండటం వలన సీరియస్ నెస్ వచ్చింది. అయితే దర్శనని ఇష్టపడటాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నాడనిపిస్తుంది. దర్శకుడు ఆ పాత్రని అలా డిజైన్ చేసాడో, లేదా ఆయన సీరియస్ గా చేసుకుంటూ వెళ్ళాడేమో కానీ దర్శనపై విష్ణు కంటే శర్మ పాత్రలోనే ఎక్కువ ఫీలింగ్స్ కనిపిస్తాయి. మనవడిలో మంచితనం పెంచే పాత్రలో కనిపించారు శుభలేఖ సుధాకర్. రాజన్ గా కనిపించిన శరత్ లోహితస్వది విష్ణు కథని వినే పాత్ర. ఏకాంతంగా కనిపించిన పమ్మిసాయి.. కథపై ఆసక్తిని కలిగించే పాత్రే. సి.అర్ గా కనిపించిన లక్కీ కేజీఎఫ్, దేవి ప్రసాద్, ఆమని, ఎల్బీ శ్రీరాం మిగతా పాత్రధారులు పరిధిమేర చేశారు

చైతన్ మ్యూజిక్ బావుంది. తిరుపతి నేపధ్యంలో వచ్చే పాట, డెన్ లో విష్ణు పాడుకునే పాట ఆకట్టుకుంటాయి. కెమరాపనితనం చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. కొన్ని అలరించే సింగిల్ లైనర్స్ రాశారు. ప్రేక్షకులని ఎంగేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు దర్శకుడు. కథలో రెండు మూడు లేయర్స్ ఉన్నప్పటికీ ఎలాంటి కన్ ఫ్యుజన్ లేకుండా ప్రజంట్ చేశాడు. ఒక కాన్సెప్ట్, ప్రేమ కథ, మర్డర్ మిస్టరీ, సస్పెన్స్, దేశభక్తి.. ఇవన్నీ కలిపి ఒక ఆల్ మిక్సర్ పొట్లం కట్టాడు. విష్ణు చెప్పిన ఈ మిక్సర్ పొట్లం కథ ఓసారికి చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

50 డేస్ : మిన్నంటుతున్న యువగళం !

యువగళం పాదయాత్ర యాభై రోజులయింది. కుప్పం నుంచి ప్రారంభించి పుట్టపర్తి నియోజకవర్గం వరకూ వచ్చారు. ఈ యాభై రోజుల్లోనే అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పట్టభద్రులు టీడీపీ వైపు ఉన్నట్లుగా తేలింది....

ఆర్కే పలుకు : ఈ వారం ఉచిత సలహాలు!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాల తర్వాత ఇక ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏం రాస్తారోనని.. ఆయన మాటలకు హద్దులు ఉండవని అంచనాలు పెంచేసుకున్న వారికి ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే...

తిరుమలలో కూడా గంజాయి – ఇదీ ఏపీ పరిస్థితి !

తిరుమలలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడం అక్కడ పెద్ద ఎత్తున దందా జరుగుతోందని పోలీసులు గుర్తించడంతో శ్రీవారి భక్తులు నివ్వెర పోతున్నారు. ఎంతో పవిత్రంగా...

మ‌నోజ్ ద‌గ్గ‌ర ఇంకా వీడియోలు ఉన్నాయా?

మంచు ఇంట్లో... అన్నాద‌మ్ముల గొడ‌వ‌తో కాక పుట్టిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌నోజ్ ఓ వీడియో విడుద‌ల చేయ‌డంతో... విష్ణుతో త‌న‌కున్న విబేధాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శుక్ర‌వారం అంతా ఇదే హాట్ టాపిక్‌....

HOT NEWS

css.php
[X] Close
[X] Close