రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా ఆసక్తిని పెంచిది. ఈ ట్రైలర్ ని చుసిన ఇండస్ట్రీ ప్రముఖులు దర్శకుడు వేణుకి ఫోన్ చేసి ‘సినిమా ఎప్పుడు చుపిస్తున్నావ్’ అని అడుగుతున్నారట. ఇందులో దర్శకుడు సుకుమార్ , క్రిష్ లాంటి వారు వున్నారు. విలక్షణమైన సినిమాని ఆదరిస్తుంటారు సుకుమార్, క్రిష్. కంటెంట్ నచ్చితే తమ వంతు మాట సాయం చేస్తుంటారు. ఇప్పుడు విరాట పర్వం వారి ద్రుష్టిని ఆకర్షించింది. సినిమా నిర్మాతలు కూడా దర్శకుల కోసం హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన షో వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. విడుదలకు ముందే ఈ స్పెషల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులని ఈ షోకి ఆహ్వానించే అవకాశం వుంది. సుకుమార్, క్రిష్ తో పాటు మిగతా దర్శకులు సినిమా గురించి ఒక పాజిటిట్ మాట చెప్పడం కూడా ప్రమోషన్స్ లో భాగమైయ్యే ఛాన్స్ వుంది జూన్ 17న ఈ చిత్రం థియేటర్ లోకి వస్తుంది.