సాయిప‌ల్ల‌వి కోస‌మే సినిమా తీశాంరా బాబు..!

విరాట‌ప‌ర్వం… ఈ సినిమా పూర్త‌యి చాలా కాలం అయ్యింది. మ‌ధ్య‌లో ఓటీటీనా – ధియేట‌రా? అంటూ ఊగిస‌లాడింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. ఈనెల 17న విరాట‌ప‌ర్వం విడుద‌ల అవుతోంది.

విరాట‌ప‌ర్వం సినిమాపై చాలా గాసిప్పులు వ‌చ్చాయి. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి పాత్రే హైలెట్ అయ్యింద‌ని, ఈ సినిమా క‌థంతా ఆమె చుట్టూనే తిరుగుతుంద‌ని, రానా కేవ‌లం.. స‌పోర్టింగ్ రోల్ కి మాత్ర‌మే ప‌రిమితం అయ్యాడ‌ని… ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు. సాయి ప‌ల్ల‌వి ఎక్క‌డ హైలెట్ అయిపోతుందో అని రానా కంగారు ప‌డుతున్నాడ‌ని, అందులో రీషూట్లు చేశార‌ని, సినిమాకి క‌త్తెర్లు ప‌డ్డాయ‌ని ర‌క‌ర‌కాల క‌బుర్లు.

ఈ వార్త‌ల‌న్నీ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర‌కూ చేరాయేమో..? వాళ్లు కొత్త త‌ర‌హా ప్ర‌చారం మొద‌టెట్టారు. `ఈ సినిమా సాయి ప‌ల్ల‌వి కోస‌మే తీశాం..` అని ముందే చెప్పేసి, జ‌నాల్ని ప్రిపేర్ చేయ‌డం మొద‌లెట్టారు. రేపు (ఆదివారం) క‌ర్నూలులో ట్రైల‌ర్ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌బోతోంది. ఈ సంర్భంగా చిత్ర‌బృందం ఓ ప్ర‌మోష‌న‌ల్ వీడియో విడుద‌ల చేసింది. ఓ యూట్యూబ‌ర్‌… రానాని వెదుక్కుంటూ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కివెళ్లాడు. తాను సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్ అని ప‌రిచ‌యం చేసుకుని, `మా సాయి ప‌ల్ల‌వి ఎప్పుడొస్తుంది? ట్రైల‌ర్ ఎప్పుడు` అని ప్ర‌శ్న‌లు సంధిస్తాడు. అందుకు రానా `నేను కూడా సాయి ప‌ల్ల‌వి ఫ్యానే.. ఈ సినిమాని సాయి ప‌ల్ల‌వి కోస‌మే తీశాం రా బాబూ` అని చెప్పి.. ఆ అభిమానిని శాంతింప చేస్తాడు. అంటే.. ఇది అచ్చంగా సాయి ప‌ల్ల‌వి సినిమానే అని చిత్ర‌బృందం ఒప్పేసుకున్న‌ట్టే క‌దా? ఈ విష‌యంలో రానా కూడా ఈగోల‌కు పోకుండా `నేను సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్‌. త‌న కోస‌మే ఈ సినిమా తీశాం` అని చెప్పుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది. సో.. రానానే స్వ‌యంగా ఒప్పుకొన్నాడు కాబ‌ట్టి… గాసిప్పుల‌కు పుల్ స్టాప్ పెట్టేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close