ఐటీ హబ్‌గా విశాఖను మార్చాలన్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. ఓ డిజాస్టర్ గా మారిన పాలన తర్వాత కూడా పెట్టుబడిదారుల్ని ఆకర్షించడం చిన్న విషయం కాదు. తాము వస్తే మళ్లీ భూముల్ని లాక్కుంటామంటూ ప్రకటనలు చేస్తూ వాటిని భయపెట్టేందుకు వైసీపీ భయంకరమైన కుట్ర చేస్తున్నప్పటికీ .. విశ్వాసం కల్పించడం చిన్న విషయం ఏమీ లేదు.
టీసీఎస్ ఐటీ డెలవప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మిలీనియం టవర్స్ లో తాత్కాలికంగా ఆఫీస్ ప్రారంభిస్తోంది. శాశ్వత నిర్మాణాలను ప్రారంభించబోతోంది. కాగ్నిజెంట్ విశాఖలో భారీ క్యాంపస్ పెడుతున్నట్లుగా ప్రకటించింది. ఈ ఏడాదే కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. TCS తర్వాత రెండో పెద్ద ప్రాజెక్టు. ANSR కూడా GCC ఇన్నోవేషన్ క్యాంపస్, మధురవాడలో నిర్మించనుంది. ఇక సత్వ 30 ఏకరాల IT పార్క్ , గ్రేడ్ A ఆఫీసులు నిర్మించబోతోంది. తాజాగా యాక్సెంచర్ కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది.
అమెరికాలో ఉన్న పరిస్థితుల కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడే ఆఫీసులు తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విశాఖ చాలా కంపెనీలకు ఇండియాలో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఐదు నుంచి పదేళ్ల కాలంలో అనౌన్స్ చేసిన కంపెనీలకు తోడు ఇంకా వస్తాయని భావిస్తున్న కంపెనీలు ప్రారంభమైతే లక్షల్లో ఐటీ ఉద్యోగులు విశాఖకు వస్తారు. దీంతో విశాఖ కూడా వరల్డ్ క్లాస్ సిటీగా మారుతుంది.
ఇప్పటికే విశాఖలో మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతోంది. ఎయిర్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఇక విశాఖ అభివృద్ధిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఎవరూ నమ్మరు.