ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న రెండు సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇందులో విశ్వంభర షూటింగ్ నేటితో పూర్తయింది. చిరు–మౌనీ రాయ్‌పై తీసిన స్పెషల్ డ్యాన్స్ నెంబర్‌తో గుమ్మడికాయ్ కొట్టారు. అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాల బజ్ పోల్చుకుంటే అనిల్–చిరు కాంబో మీదే ఎక్కువ హైప్ ఉంది. ఇంకా టీజర్ కూడా రాకుండానే ఆ సినిమాకి అంత క్రేజ్ రావడానికి కారణం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యాక్టర్. అపజయం లేని ఆయన చాలా పక్కాగా తీసుకుంటూ వెళ్తున్నారు.
విశ్వంభర పరిస్థితి మాత్రం వింతగా మారింది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సినిమా బజ్‌పై చాలా ప్రభావం చూపింది. గ్రాఫిక్స్ అన్నీ తేలిపోయాయి. దీంతో టోటల్ సినిమా మీదే ఎఫెక్ట్ పడింది. గ్రాఫిక్స్ స్కోప్ ఉన్న కథలో అవి పక్కాగా కుదరాల్సిందే. యావరేజ్‌గా ఉన్న జనం ఆసక్తి చూపించడం లేదు. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి టీం చాలా బలంగా గ్రాఫిక్స్‌ని డిజైన్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది.
అయితే కేవలం మాటలు సరిపోవు. విశ్వంభరపై మళ్లీ బజ్ రావాలంటే.. ఏదో బలమైన కంటెంట్ సినిమా నుంచి వదలాలి. అది ట్రేడ్, జనాలకు నచ్చాలి. గ్రాఫిక్స్‌పై ఉన్న అనుమానాలు తొలగాలి. అప్పుడే ఆటోమేటిక్‌గా బజ్ వస్తుంది. ఇప్పుడు టీం కూడా అదే ప్లాన్‌లో ఉందని తెలుస్తుంది. సినిమా నుంచే వచ్చే తర్వాత కంటెంట్‌పై చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈసారి విశ్వంభర నుంచి వచ్చే కంటెంట్ ఖచ్చితంగా అంచనాలు పెంచేదిగా ఉంటుందని తెలుస్తోంది.