ది కాశ్మీర్ ఫైల్స్, ది తాష్కెంట్ ఫైల్స్ తర్వాత “ఫైల్స్” సిరీస్‌లో వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరో హార్డ్ హిట్టింగ్ సినిమాను తెరకెక్కించారు. అదే బెంగాల్ ఫైల్స్. మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు ట్రైలర్‌ని వదిలారు. వెస్ట్ బెంగాల్ రాజకీయ హింసా చరిత్రను ఈ ట్రైలర్ ఒక గ్లింప్స్ లా చూపించింది. ట్రైలర్లో సున్నితమైన అంశాలు, మారణహోమాలు, షాకింగ్ మూమెంట్స్ ఉన్నాయి.
“కాశ్మీర్ బాధ పెట్టిందంటే, బెంగాల్ వెంటాడుతుంది” అని ట్రైలర్లో డిక్లేర్ చేశాడు డైరెక్టర్ వివేక్ రంజన్. “ఇది పశ్చిమ బెంగాల్, ఇక్కడ రెండు కాన్స్టిట్యూషన్స్ నడుస్తాయి. బెంగాల్ అనేది కేవలం ఓ స్థలం కాదు, ఇది భారత్‌కు లైట్ హౌస్. దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ కమ్యూనల్ వార్స్ తో కొట్టుకుంటున్నాం. ఇదేనా స్వతంత్రం” లాంటి డైలాగులు వినిపించాయి.
వివాదాస్పద విజువల్స్, వైలెన్స్, కమ్యూనల్ వార్, రాజకీయ, ఐడియాలజీ ఇలా చాలా అంశాలను ఇందులో టచ్ చేశారు. కాశ్మీర్ ఫైల్స్ లా ఈ సినిమా కూడా కంటెంట్ పరంగా వివాదమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ ట్రైలర్‌ను కోల్‌కతాలో లాంచ్ చేశారు. అయితే అక్కడ థియేటర్స్‌లో ప్రదర్శించినప్పుడు పలుమార్లు పవర్ కట్స్ జరిగాయి. దీనిపై డైరెక్టర్ వివేక్ రంజన్ ఇప్పటికే తన నిరసన వ్యక్తం చేశాడు. సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యాకా ఇంకెన్ని వివాదాలు తెరపైకి తెస్తుందో చూడాలి.