ఆంధ్రప్రదేశ్‌లోని ‘డెస్టినీ సిటీ’ విశాఖ ఇప్పుడు భారత గ్లోబల్ టెక్నాలజీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్‌హౌస్‌గా మారుతోంది. గూగుల్, ఆక్సెంచర్, TCS, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ జెయింట్స్ నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పెట్టుబడులు లక్షల ఉద్యోగాలను సృష్టించి, విశాఖను ప్రపంచ స్థాయి టెక్ హబ్‌గా మారుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గూగులే విశాఖకు బ్రాండ్ అంబాసిడర్
ప్రపంచ ప్రసిద్ధ టెక్ జెయింట్ గూగుల్, తన భారతీయ సబ్సిడియరీ రైడెన్ ఇన్ఫోటెక్ ద్వారా విశాఖపట్నంలో సుమారు రూ.1,30,000 కోట్లతో AI డేటా హబ్‌ను నిర్మిస్తోంది. ఇది అమెరికా వెలుపల గూగుల్ చేస్తున్న అతిపెద్ద పెట్టుబడి. ఈ హబ్‌లో 1 గిగావాట్ స్థాయి డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వే, పునర్వినియోగ శక్తి వ్యవస్థలు ఉంటాయి. తర్లువాడ, ఆడవివరం, రాంబిల్లిలో మూడు క్యాంపస్‌లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తవుతుందని, 1,80,000కి పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ ప్రకటించారు. ఇది విశాఖను AI-డ్రైవెన్ స్మార్ట్ సిటీగా మారుస్తుంది. “
ఇతర సంస్థల భారీ పెట్టుబజులు
ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ విశాఖపట్నంలో రూ. 140 కోట్ల పెట్టుబడితో IT పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది 2,600 డైరెక్ట్ ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఈ పార్క్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, AI సొల్యూషన్స్‌పై దృష్టి పెడుతుంది. ఆక్సెంచర్ విశాఖపట్నంలో 10 ఎకరాల భూమిపై కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తోంది. ఈ క్యాంపస్ 12,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది. USలో H-1B వీసా ఫీలు పెరగడంతో, భారతీయ IT రంగం దక్షిణాది చిన్న నగరాల వైపు మళ్లింది. TCS, కాగ్నిజెంట్‌తో పాటు ఆక్సెంచర్ కూడా విశాఖను GCC హబ్‌గా చేస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖపట్నంలోని IT హిల్స్ లో 21.16 ఎకరాల భూమిలో రూ. 1,300 కోట్ల పెట్టుబడితో డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తోంది. మిలీనియం టవర్స్‌లో తాత్కాలిక ఆపరేషన్స్ మొదలవబోతున్నాయి. మొదటి దశలో 2,000 మంది, మొత్తం 12,000 ఉద్యోగాలు కల్పిస్తుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ మధురవాడలో 22.19 ఎకరాల్లో రూ. 1,582.98 కోట్ల పెట్టుబడితో టెక్ పార్క్ నిర్మిస్తోంది. మొత్తం 8,000 ఉద్యోగాలు. జూన్ 2028 నాటికి ఫేజ్-1 పూర్తవుతుంది.
ఇతర పరిశ్రమలు కూడా !
అవంతి వేర్‌హౌసింగ్ సర్వీసెస్ విశాఖపట్నంలో రూ. 319 కోట్ల పెట్టుబడితో ఇండస్ట్రియల్ ఫెసిలిటీని నిర్మిస్తోంది. ఇది లాజిస్టిక్స్, స్టోరేజ్, ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి పెడుతుంది. సిమెంట్, ఆటోమోటివ్, ఫుడ్, ఫార్మా వంటి రంగాలకు సేవలు అందిస్తుంది. షాన్వీరా ఇండస్ట్రీస్ విశాఖపట్నంలో రూ.260 కోట్ల పెట్టుబడితో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను స్థాపిస్తోంది. ఇది మెటల్, మెకానికల్ ఎంజినీరింగ్ రంగాల్లో ఉత్పత్తులను అందిస్తుంది. విశాఖ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్‌లో భాగంగా, ఈ యూనిట్ వేలాది ఉద్యోగాలను కల్పిస్తుంది. గజువాక, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులు విశాఖకు రూ. 30,000 కోట్ల పెట్టుబడులకు ఆకర్షిస్తున్నాయి.
ఈ పెట్టుబడులు విశాఖను బెంగళూరు, హైదరాబాద్‌తో పోటీపడే టెక్ హబ్‌గా మారుస్తాయి. మొత్తం 67,000కి పైగా ఉద్యోగాలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు ఊతమిస్తాయి. “విశాఖ భవిష్యత్ AI పవర్‌హౌస్” గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.