విశాఖ రియల్ ఎస్టేట్‌కు ఎండాడ ఓ డైమండ్‌లా మారుతోంది. విశాఖపట్నం నగర కేంద్రానికి దగ్గరగా కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి సమీపంలో ఉండటం వల్ల ఎండాడ ఇప్పుడు. హాట్ ప్రాపర్టీగా మారింది. ఎండాడ సమీపంలో రుషికొండ ఐటీ హిల్స్ ఉన్నాయి. పలు కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. వచ్చే రెండు, మూడేళ్లలో విశాఖ ఐటీ రుషికొండ చుట్టుపక్కలే కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఎండాడకు ప్రధాన ఆకర్షణ బీచ్. రుషికొండ బీచ్, లాసన్బే కాలనీ ఇప్పటికే ఆకర్షణీయంగా ఉంటాయి. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఎండాడలో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది స్మార్ట్ సిటీ మిషన్ కింద విశాఖపట్నంలో చేపట్టిన ప్రాజెక్టులు ఎండాడలో మౌలిక వసతుల్ని పెంచుతున్నాయి.
ఎండాడలో అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఐటీ ఉద్యోగులు, ఉన్నత మధ్యతరగతి కుటుంబాలు, ఎన్నారైలు లగ్జరీ ఫ్లాట్లు , సీ-వ్యూ విల్లాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అపార్టుమెంట్లలో చదరపు అడుగు ఐదు వేల నుంచి పది వేల వరకూ సౌకర్యాలను బట్టి పలుకుతోంది. డబుల్ బెడ్ రూం యాభై లక్షలకు వస్తోంది. కాస్త లగ్జరీ అయితే త్రిబుల్ బెడ్ రూం కోటి రూపాయలు చెబుతున్నారు. ఓపెన్ ప్లాట్లు అయితే..చదరుపు గజం ముఫ్పై నుంచి అరవై వేల రూపాయల వరకూ ఉన్నాయి.
ఎండాడ సమీపంలోని ఐటీ, నిర్మాణ, పరిశ్రమల కారణంగా జనాభా పెరుగుతోంది. కాలనీలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్ లో ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.