కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ల చోరీ పేరుతో చేస్తున్న ఉద్యమం తేలిపోతోంది. బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లనుచోరీ చేశారని ఆరోపించి ఆయన అక్కడ పాదయాత్ర ప్రారంభించారు. ఆ ఇరవై ఐదు లక్షల ఓట్ల గురించి ఎన్నికలసంఘం పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచింది. ఎవరెవరి ఓట్లు తీసేశారో.. ఎందుకు తీసేశారో పూర్తి వివరాలు వెల్లడించింది. ఇప్పుడు ఆ 65లక్షల ఓట్లలో ఎన్ని ఓట్లు చోరీ జరిగాయో నిరూపించాల్సి ఉంది. కానీ దాని గురించి పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తామని బయలుదేరారు.
బీహార్లో ప్రకటించిన తీసివేత ఓట్ల జాబితాల్లో పెద్దగా లోపాలు బయటపడటం లేదు. తమ ఓట్లు తీసేశానని ఎవరూ చెప్పడం లేదు. ఏదైనా చిన్న చాన్స్ దొరికితే ఆర్జేడీ, కాంగ్రెస్ రచ్చ చేసేవి. కానీ ఏమీ బయటపడకపోవడంతో.. రాజకీయం చేయలేకపోతున్నారు. సుప్రీంకోర్టు కూడా రాజకీయ పార్టీలపై అసహనం వ్యక్తం చేసింది. ఇతర పార్టీల సంగతేమో కానీ ఓట్ల చోరీ అంటూ ఉద్యమాలు, పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ మాత్రం దీన్ని నిరూపించాల్సి ఉంది.
తాము చేస్తున్న ఉద్యమం పట్ల ప్రజల్లో వస్తున్న ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకుని దానికి తగ్గట్లుగా వ్యవహరించాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉంది. ప్రజలతో కనెక్షన్ లేని రాజకీయాలు చేసి ప్రయోజనం ఉండదు. పైగా..కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఎన్నికల సంఘం పై పోరాటం. తేడా వస్తే.. రాజ్యాంగవ్యవస్థపై తప్పుడు రాజకీయాల కోసం దాడులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటారు. అందుకే ఈ విషయంలో కాంగ్రెస్ మరింత సీరియస్ గా వ్యవహరించాల్సి ఉంది.
తాము మహారాష్ట్రలో, హర్యానాల్లో గెలవాల్సి ఉన్నా.. ఓట్ల చోరీ కారణంగానేఓడిపోయామంటున్నారు. గద్దెను చోరీ చేశారని కూడా అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ఓట్ల చోరీ కారణం అంటున్నారు. మహదేవపురా నియోజకవర్గంలో బయటపెట్టిన ఓట్ల జాబితాలోని లోపాలతోపెద్దగా ఇంపాక్ట్ రాలేదు. మెట్రోల్లో ప్రతి చోటా అలాంటి ఓటర్ల విచిత్రాలు ఉంటాయి. చరితం పకడ్బందీగా.. రాహుల్.. తన వాదనకు.. అణుబాంబు లాంటి సాక్ష్యాలను ప్రజల ముందుపెట్టి ఉద్యమం చేయాల్సి ఉంది. లేకపోతే పూర్తిగా ప్రజలతో కనెక్షన్ లేకుండా పోతుంది.