ఉండవల్లి అరుణ్ కుమార్ ఉగ్గబట్టుకోలేకపోతున్నారు. జగన్ రెడ్డి రాను రాను పొలిటికల్ కామెడీలు చేయడం పెరిగిపోవడంతో ఎలాగోలా ఇతర నేతలపై విమర్శలు చేసి సమం చేద్దామని ప్రయత్నించేందుకు తన వంతు పాత్ర పోషిస్తూంటారు. ఈ క్రమంలో శనివారం ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ దిష్టి వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేశారు. నిజానికి తెలంగాణ నేతలు కూడా ఓ రోజు విమర్శించి తరవాత రోజు మర్చిపోయారు. కానీ ఉండవల్లి మాత్రం మళ్లీ పనిగట్టుకుని గుర్తు చేసారు.
కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ అన్నారని డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఊహించలేదన్నారు. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన వివరణ ఇచ్చింది. తెలంగాణ నేతలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పనిగట్టుకుని మళ్లీ పవన్ తప్పుగా మాట్లాడాడని చెప్పడం ఎందుకు?
ప్రతిపక్షం చేయాల్సిన పని చేయుకండా.. పడుకుంటే ఆయనకు ఏమీ అనిపించడం లేదు కానీ.. పెట్టుబడుల మీద రాళ్లేయడానికి మాత్రం ముందుకు వచ్చారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని తెస్తున్న చంద్రబాబు.. ఆయన కంపెనీని ఎందుకు తేవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో హెరిటేజ్ పెట్టుబడులు లేవని ఆయనకు ఎవరు చెప్పారో.. ఆ సంస్థ పెట్టుబడుల ప్రణాళికలు ఉంటే ఏపీనే ఎంచుకుంటుంది. కానీ హెడ్ ఆఫీసును ఏపీకి తేవాలని వింత వాదన తెస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేవారు హెడ్ క్వార్టర్స్ ను తీసుకురావడం లేదని ఆయనకు తెలుసు. కానీ తెలియనట్లుగా నటిస్తారు. చంద్రబాబును మాత్రమే అంటున్నారేమిటని అంటారని.. భారతి సిమెంట్స్ ను కూడా ప్రస్తావించారు. కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటో అందరికీ తెలుసు.
జగన్ రెడ్డికి సరైన సలహాలిచ్చేవాళ్లు లేక.. దారి తప్పుతున్నారని అందరూ అనుకుంటున్నారు. ఉండవల్లి ఇలా ప్రెస్మీట్లు పెట్టి బాధపడేబదులు నేరుగా తాడేపల్లిలో పర్మినెంట్ జాబ్ చేస్తే బెటర్ కదా అన్న సూచనలు.. వైసీపీ వర్గాలు నుంచి కూడా వస్తున్నాయి.