‘బుజ్జి’కి పేటెంట్‌.. త‌రువాతి స్టెప్ ఇదే!

ప్ర‌తిభావంత‌మైన‌ ఇంజ‌నీరింగ్ బృందం చేయాల్సిన ప‌నిని ‘క‌ల్కి’ టీమ్ చేసింది. సినిమా కోసం వినూత్న‌మైన డిజైన్ తో ఓ కారు త‌యారు చేసేసింది. ఆ కారులోనే ప్ర‌భాస్ ఎంట్రీ ఇచ్చి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. ఇప్పుడు బుజ్జి ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఏం చేయ‌గ‌ల‌దో కూడా అర్థ‌మైంది. బుజ్జికి మ‌రింత మైలేజ్ తీసుకురావ‌డానికి తెర వెనుక ఇంకా చాలా హంగామానే న‌డిపిస్తోంది వైజ‌యంతీ మూవీస్ బృందం.

సినిమా కోసం ఇలాంటి వినూత్న‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు చేసిన‌పప్పుడు వాటికి సంబంధించిన పేటెంట్ హ‌క్కులు త‌మ ద‌గ్గ‌రే ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతుంటారంతా. ఇప్పుడు వైజ‌యంతీ మూవీస్ కూడా అదే చేసింది. బుజ్జి మోడ‌ల్ పేటెంట్ హ‌క్కులు ద‌క్కించుకొంది. ఇప్పుడు ఈ బుజ్జిని దేశ‌మంతా తిప్ప‌బోతున్నారు. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు బుజ్జి వెళ్ల‌బోతోంది. ముంబై, చెన్నై, కొచ్చి, బెంగ‌ళూరు లాంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో బుజ్జిని తీసుకెళ్తారు. అక్క‌డ కొన్ని ప్ర‌త్యేక ఈవెంట్లు నిర్వ‌హిస్తారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో విరివిగా బుజ్జిని వాడుకోవాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. సినిమా పూర్త‌య్యాక‌.. ఈ బుజ్జిని అలానే భ‌ద్ర‌ప‌రచాలా? లేదా అభిమానుల‌కు కానుక ఇవ్వాలా? లేదంటే వేలం వేసి, ఆ డ‌బ్బుల‌తో ఏమైనా మంచి కార్యక్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాలా? అనే దిశ‌గా వైజ‌యంతీ మూవీస్ ఆలోచిస్తోంది. మొత్తానికి ఎలా చూసినా, ఈ బుజ్జి తెలుగు సినిమాని అంత‌ర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ల‌డానికి ఓ బ్రాండ్ గా ఉప‌యోగ‌ప‌డ‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిలో జగన్ గుర్తులు అలాగే !

అమరావతిలో జగన్ జ్ఞాపకాల్ని అలాగే ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ జ్ఞాపకాలు అంటే ఆయన నిర్మించినవి ఏవీ లేవు. ధ్వంసం చేసివవే. ముఖ్యంగా ప్రజావేదిక. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న తెలివి...

ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌లో అసలు కథ త్వరలో !

విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఆయన భార్య, కుమారుడ్ని నిర్బంధించి ఆస్తులు రాయించుకున్న ముఠా వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడూ బయటకు రాలేదు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారో కూడా...

మోదీకి చెక్ పెట్టేలా ఆరెస్సెస్ వ్యూహం !

ఆరెస్సెస్‌కు మోదీకి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. రాముడే మోదీకి బుద్ధి చెప్పాడనే ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్అవుతున్నాయి . ఆయన ఒక్కడే ఈ లతరహాలో వ్యవహరిస్తే...

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ ?

బీఆర్ఎస్ పార్టీ ఊపిరి పోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఆ విషయంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close