దేవీ… ఇచ్చేశాడ‌య్యా హిట్ సాంగ్‌!

వాల్తేరు వీర‌య్య నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు పాట‌లొచ్చాయి. అవే… ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి – శ్రీ‌దేవి’. ఈ రెండు పాట‌లూ బాగానే ఉన్నాయి.కానీ ఏదో మిస్స‌య్యింది. చిరంజీవి – దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ క‌లిస్తే వ‌చ్చే కిక్‌.. ఈ రెండు పాట‌ల్లోనూ మిస్ అయ్యింది. బాస్ పార్టీపై అయితే… ట్రోలింగ్ కూడా జ‌రిగింది. ఈ రెండు పాట‌ల్నీ రాసింది… దేవిశ్రీ ప్ర‌సాదే. సాహిత్య ప‌రంగానూ.. ఈ రెండు పాట‌లూ తేలిపోయాయి. దాంతో మెగా అభిమానుల‌కు తొలిసారి దేవిశ్రీ ప్ర‌సాద్ పై కోపం వ‌చ్చింది. మెగా సినిమాకి స‌రిపోయే ట్యూన్లు ఇవ్వ‌లేదంటూ… వాళ్లంతా అలిగారు. ఇప్పుడు ఈ ఆల్బ‌మ్ నుంచి ముచ్చ‌ట‌గా మూడో సాంగ్ వ‌చ్చింది. సినిమాకి ఆయువు ప‌ట్ట‌యిన టైటిల్ గీత‌మిది. అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించిన ఈ పాట‌ని చంద్ర‌బోస్ రాశారు. ఈ పాటైతే.. ఇన్‌స్టెంట్ హిట్‌. భ‌గ భ‌గ భ‌గ భ‌గ భ‌గ‌… అంటూ.. పాట ఎత్తు కోవ‌డ‌మే హై పిచ్‌లోకి వెళ్లిపోయింది. అక్క‌డి నుంచి.. ఎక్క‌డా ఆగ‌లేదు. చంద్ర‌బోస్ క‌లం కూడా ట్యూనుతో పాటు ప‌రిగెట్టింది.

వినాశ‌కారుల స్మ‌శాన‌మ‌వుతాడు
తుఫాను అంచున త‌ప‌స్సు చేసే వ‌శిష్టుడు
త‌ల‌ల్ని తీసే విశిష్టుడు..

మగాన్ని వేడాటే శ‌తాగ్ని
తెగించి వ‌చ్చే త్రిశూలం
య‌ముడు రాసే క‌విత్వం
న‌వ శ‌కాన ఎర్ర‌ని క‌పోతం ఇలా…. హీరోయిజానికి కొత్త ఎలివేష‌న్లు ఈ పాట‌లో వినిపించాయి. లిరియ‌క‌ల్ వీడియో చూస్తుంటే.. యాక్ష‌న్ ఎపిసోడ్ లో వ‌చ్చే గీత‌మ‌ని స్ప‌ష్టం అవుతోంది. అందులో చిరంజీవి ఇమేజెస్‌. ప‌వ‌ర్‌ఫుల్ ఎంట్రీస్‌… ఇవ‌న్నీ గూజ్‌బమ్స్ ఇచ్చే మూమెంట్ లా అనిపిస్తోంది. టైటిల్ గీత‌మే అయినా.. సినిమా క్లైమాక్స్ లో ఈ పాట వ‌చ్చే అవ‌కాశం ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ చాలా శ్ర‌ద్ధ‌గా, క‌సిగా కంపోజ్ చేసిన ఫీలింగ్ క‌లుగుతోంది. గ‌త రెండు పాట‌ల్లో ఉన్న అసంతృప్తి.. మూడో పాట‌కు తొల‌గిపోయిన‌ట్టే. ఈ సిన‌మాలో ఇంకో రెండు పాట‌లున్నాయి. అవెలా ఉంటాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

2 COMMENTS

Comments are closed.