”వార్ 2 తో ఎన్టీఆర్ అన్నని హిందీలోకి తీసుకువెళ్లినట్లు లేదు. హృతిక్ గారిని తెలుగులోకి తీసుకొచ్చినట్టుంది. ఇది హిందీ సినిమా కాదు. ప్రాపర్ తెలుగు సినిమా” అన్నారు నిర్మాత నాగ వంశీ. వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ”వార్ 2 చూసిన తర్వాత తెలుగు డైరెక్టర్స్ కంటే అయాన్ ముఖర్జీ గారు ఎన్టీఆర్ గారిని అద్భుతంగా చూపించారని ఆడియన్స్ ఫీల్ అవుతారు” అని చెప్పారు.
”ఈ సినిమాతో హృతిక్ గారిని తెలుగులోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా చేస్తున్నామో 14న మీరు చూపించాలి. గత ఏడాది సెప్టెంబర్ 27వ తారీఖున దేవరకి ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి. హిందీ బాక్సాఫీస్ ఎంత నెట్ కలెక్ట్ చేస్తుందో దానికంటే ఎక్కువ తెలుగు బాక్సాఫీస్ కలెక్ట్ చేయాలి. దేవరకంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్స్ తీసుకురావాలి. ఇది అభిమానుల బాధ్యత. అన్న ఇండియాలో కాలర్ ఎగరేసేలా మనం చేయాలి. ఈ సినిమాని మీ మీద వదిలేస్తున్నాం” అన్నారు.
”సినిమా అద్భుతంగా ఉంది. సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు. అది గ్యారెంటీ. నన్ను మామూలుగానే తిడతారు. సినిమా బాగోలేదంటే దానికి పదింతలు తిడుతారుగాని, కానీ సినిమా చూసిన వాళ్లు ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్లిన తర్వాత ఒక అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను” అన్నారు. మొత్తానికి నాగ వంశీ స్పీచ్ అభిమానుల్లో మంచి జోష్ నింపింది.