శ్రుతిహాసన్, గౌతమి మధ్య గొడవలు మొదలయ్యాయా? వీళ్లిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉన్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. కమల్ ప్రస్తుతం గౌతమితో సహ జీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ అనఫిషియల్ భార్యా భర్తలు. సొసైటీ కోసం.. గౌతమిపై ప్రేమ ఒలకబోసేది శ్రుతి. అయితే.. ఇప్పుడు శ్రుతి అసలు రంగు బయటపడింది. కమల్ చిత్రాలకు గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తుంటుంది. కమల్ హాసన్ – శ్రుతి హాసన్ తొలిసారి ఓ చిత్రంలో కలసి నటిస్తున్నారు. ఆ సినిమాకీ గౌతమినే కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తోంది. ఈవిషయంలోనే గౌతమి, శ్రుతిలకు వార్ నడుస్తోందట. ‘సినిమాలో అందరికీ కాస్ట్యూమ్స్ ఇచ్చుకోండి. నా దుస్తులు మాత్రం నేనే డిజైన్ చేయించుకొంటా’ అంటోందట. ఇప్పటి వరకూ గౌతమి తయారు చేసిన కాస్ట్యూమ్స్‌ని వెనక్కి పంపేసిందట. ‘మీరు డిజైన్ చేస్తున్న కాస్ట్యూమ్స్ నాకు నచ్చలేదు’ అని మొహంమీదే చెప్పేసిందట.
ఈ విషయంలో సెట్లో గౌతమికీ, శ్రుతికీ వార్ జరిగిందని, గౌతమి తీరుపై శ్రుతి.. శ్రుతి వ్యవహారంపై గౌతమి అసంతృప్తిగా ఉన్నారని, ఈ విషయంలో కలగ చేసుకోవడానికి కమల్‌హాసన్ కూడా ధైర్యం చేయడం లేదని టాక్. శ్రుతి వ్యవహారంపై అలిగిన గౌతమి..’ఈ సినిమాకి నేను పనిచేయను’ అని కమల్‌కి చెప్పేసి… టీమ్‌తో తెగదెంపులు చేసుకొందని తెలుస్తోంది. గౌతమి, శ్రుతిల కోల్డ్ వార్ ఇప్పుడు తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యింది. వీళ్ల గొడవ కాస్ట్యూమ్స్ కోసం కాదని, ఏదో ఉందని.. ఇప్పుడు ఈ సాకుతో.. మాటల యుద్దం మొదలెట్టారని టీమ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కమల్‌హాసన్‌కి ఇంటి పోరు మొదలైంది.. ఇది ఎప్పటికి తీరుతుందో??