తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ ప్రశాంతంగా ఉండటం లేదు. పదవులు వచ్చే వరకూ ఓ బాధ.. వచ్చిన తర్వతా మరో బాధ. అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, వివేక్ మధ్య పొసగని పరిస్థితి వైరల్ గా మారింది. ఇటీవల ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్.. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను దున్నపోతు అని కించ పరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో అడ్లూరి లక్ష్మణ్ ఫీల్ అయ్యారు. మంగళవారం ఉదంయ ఆరు నిమిషాల వీడియో రిలీజ్ చేసి.. పొన్నం ప్రభాకర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తనను బాడీ షేమింగ్ చేయడం ఏమిటని..తన పరువు పోయిందన్నారు. అలాగే మరో మంత్రి వివేక్ పైనా ఆరోపణలు చేశారు. తాను వచ్చి కూర్చుకుంటే.. వివేక్ వెళ్లిపోతున్నారని అన్నారు. మాదిగ వర్గానికి చెందిన మంత్రిని అయిన తనను ఇలా కించపర్చడమేమిటని ఆయనంటున్నారు. ఈ అంశంపై ఆయన హైకమాండ్ కు లేఖలు రాశారు.
ఈ ఘటనపై వెంటనే టీ పీసీసీ చీఫ్ స్పందించారు. పొన్నంతో పాటు అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడారు. దీంతో అడ్లూరి లక్ష్మణ్.. కాంగ్రె్స పెద్ద కుటుంబం ్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయన్నారు. తన మాటల్ని వక్రీకరించారని పొన్నం చెప్పుకొచ్చారు. మరో వైపు వివేక్.. మీనాక్షి నటరాజన్ తో సమావేశం ఉండటం వల్ల అడ్లూరి లక్ష్మణ్ నిర్వహించిన సమావేశం మధ్యలో వెళ్లానన్నారు. ఇలా ఎవరికి వారు వారి వెర్షన్ చెబుతున్నారు.
కానీ కాంగ్రెస్ మంత్రుల పంచాయతీ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద ఎవరూ చేయి పెట్టాల్సిన పని లేదని.. వారే పెట్టుకుంటారని సెటైర్లు వేస్తున్నారు.