మరో మున్సిపల్ వార్: మార్చి 6న వరంగల్, ఖమ్మం ఎన్నికలు

హైదరాబాద్: మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ల ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మార్చి 6న ఈ రెండు కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరుగుతాయి. 9న కౌంటింగ్, ఫలితాలు ఉంటాయి. రేపటినుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 24వరకు గడువు ఉంటుంది. స్క్రూటినీని 25వ తేదీన నిర్వహిస్తారు. ఉపసంహరణకు 26 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ జారీ చేయనుంది. మరోవైపు ఈ రెండు కార్పొరేషన్‌లతో పాటు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పురపాలక సంఘానికి కూడా ఇదే షెడ్యూల్‌లో ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ దాదాపుగా ఒక నెల రొజులకు పైగా రచ్చ రచ్చే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com