ఈవారం బాక్సాఫీస్‌: మూడు ముక్క‌లాట‌

ద‌స‌రా సంద‌ర్భంగా టాలీవుడ్ కొత్త సినిమాలతో క‌ళ‌క‌ళ‌లాడింది. మ‌హాస‌ముద్రం ఫ్లాప్ అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఓకే అనిపించుకుంది. పెళ్లి సంద‌డి బోర్ కొట్టించినా, కొన్ని ఏరియాల్లో అనూహ్య‌మైన వ‌సూళ్ల‌ని రాబ‌ట్టుకుంది. ఈ వారం కూడా మూడు సినిమాలొస్తున్నాయి. అయితే… వాటిలో క్రేజ్ ఉన్న సినిమా ఏదీ లేదు.పైగా తెలిసిన న‌టీన‌టుల సినిమాలూ లేవు. ఏదైనా అద్భుతం జ‌రిగి, ఊహించ‌ని రిజ‌ల్ట్ వ‌స్తే త‌ప్ప‌… ఈవారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసుల గ‌ళ‌గ‌ళ వినిపించ‌దు.

ఈవారం వ‌స్తున్న సినిమాల్లో కాస్తో కూస్తో ఫోక‌స్ ‘నాట్యం’ సినిమాపైనే ఉంటుంది. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతున్న చిత్ర‌మిది. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వ‌హించారు. ఈసినిమాకి ప్ర‌మోష‌న్లు కాస్త గ‌ట్టిగానే చేస్తున్నారు. ట్రైల‌ర్‌ని రామ్ చ‌ర‌ణ్ ఆవిష్క‌రిస్తే, ఈసినిమా గురించి చిరంజీవి కూడా మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. అలా.. మెగా ప్ర‌మోష‌న్లు ఈ సినిమాకి ప్ల‌స్ కావొచ్చు. ఇదే రోజున ‘అస‌లేం జ‌రిగింది’, ‘మ‌ధుర వైన్స్‌’ సినిమాలొస్తున్నాయి. ఓటీటీలోనూ ఒక‌ట్రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కాక‌పోతే.. ఆ సంద‌డే క‌నిపించ‌డం లేదు. వ‌చ్చేవారం ‘రొమాంటిక్‌’, ‘వ‌రుడు కావ‌లెను’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాస‌త్ జోష్ చూడాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాలేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close