“మేఘా కృష్ణారెడ్డి” ఇంట్లో ఏం దొరికాయి..?

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అత్యంత సన్నిహితులైన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏం దొరికాయన్నదానిపై స్పష్టత లేదు. కానీ.. సుదీర్ఘంగా సోదాలు కొనసాగుతున్నాయి. విడతల వారీగా అధికారులు సోదాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సోదాల్లో.. భారీగా అవకతవకలు బయటపడి.. అప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన సమాచారం ఉంటే… సోదాలు ఆలస్యమవుతాయని.. ఆదాయపు పన్నుశాఖ నిపుణులు చెబుతున్నాయి. మొత్తం ఢిల్లీకి చెందిన ఐటీ అధికారులే.. సోదాలు చేస్తున్నారు. దాంతో లోకల్ మీడియాకు కనీస సమాచారం అందడం లేదు. కొంత మందికి అందినా.. వాటిని ప్రసారం చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించడం లేదు. మీడియాకు కూడా మేఘా కృష్ణారెడ్డి ఎంతో ఇష్టమైన వ్యక్తి కావడంతో.. ఐటీ అధికారులు ఏదైనా అధికారిక ప్రకటన ఇచ్చిన తర్వాత మాత్రమే .. వాటిని ప్రకటించే.. ప్రచురించే అవకాశం ఉంది. అయితే.. ఢిల్లీ మీడియాకు మాత్రం.. సమాచారం అందుతోంది.

దేశంలోని అగ్రశ్రేణి న్యూస్ నెట్‌వర్క్‌లలో ఒకటి అయిన నెట్‌వర్క్ 18 సంస్థ కు చెందిన న్యూస్ 18 న్యూస్ చానల్ … ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి రూ. వంద కోట్ల రూపాయల చందాను మెగా ఇంజినీరింగ్ కాంపెనీ ఇచ్చినట్లుగా ఆధారాలు దొరికాయని ప్రకటించింది. రాజకీయ పార్టీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలో మేఘా కృష్ణారెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా… అందరికీ ఆయన ఆర్థిక సాయం చేస్తారని రాజకీయపార్టీలు చెబుతూంటాయి. ఏ పార్టీ.. ఎక్కడ అధికారంలో ఉన్నా.. ఆయన తన పనులను మాత్రం స్మూత్‌గా కొనసాగించేస్తంటారు. ఈ క్రమంలో… జాతీయ స్థాయిలో ఓ ప్రముఖ పార్టీకి రూ. వంద కోట్లు ఎన్నికల ఖర్చు కింద పంపారు. అయితే.. ఇలా పంపిన విధానమే ఆశ్చర్యకరంగా ఉందని.. న్యూస్ 18 చెబుతోంది.

ఇప్పటికైతే మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో ఏం దొరికాయి..? ఇంత సుదీర్ఘంగా ఎందుకు సోదాలు చేస్తున్నారు.. ? వేల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న సంస్థ లోగుట్టు దొరికిపోయిందా..? ఎవరెవరి జాతకాలు బయటకు వస్తాయి..? అనే అంశాలపై… చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మీడియా చాలా లోప్రోఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తూండటంతో… ఈ అంశంపై సోషల్ మీడియాలోనే ఎక్కువ చర్చ జరుగుతోంది. సోదాలు ముగిసిన తర్వాత ఐటీ అధికారులు చేసే ప్రకటనను బట్టే.. మిగతా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బాక్‌: ఎన్టీఆర్ కృష్ణ‌ల ‘కురుక్షేత్ర‌’ యుద్ధం

ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుద‌ల కావ‌డం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే క‌థ‌తో విడుద‌లైతే, రెండూ ఒకే జోన‌ర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ...

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి 'అ' సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. 'అ' క‌మర్షియ‌ల్ గా...

HOT NEWS

[X] Close
[X] Close