అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కట్టుకోవాలని సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఒబెరాయ్ గ్రూపునకు పది ఎకరాల టీటీడీ ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు భూమన, వైవీ సుబ్బారెడ్డి కిక్కురుమనలేదు. ఓకే అని తీర్మానాలు చేయించారు. నిజానికి ఆ ల్యాండ్ ను 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పుణ్యక్షేత్రాల నమూనాలను నిర్మించేందుకు దేవలోక్ అనే ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం అజయ్ కుమార్ అనే వ్యక్తికి టీటీడీ పది ఎకరాల స్థలాన్ని లీజుకు వచ్చింది.
వైసీపీ ప్రభుత్వం రాగానే ఆభూమిపై కన్నేసింది. స్టార్ హోటల్ నిర్మించేందుకు ఆ పది ఎకరాల భూముల్ని ఒబెరాయ్ గ్రూపునకు కేటాయించేందుకు అజయ్ కుమార్ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగేలా చేసింది. ఇందు కోసం జగన్ అజయ్ కుమార్ పిలిపించి గన్ పెట్టి బెదిరించారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. బెదిరించి..దేవలోక్ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగేలా చేసి..కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని ముంతాజ్ హోటల్ కు ఇచ్చారని బీఆర్ నాయుడు ఆరోపణలు. జగన్ కు ఇచ్చిన లంచాల మహిమతో ఇక ఎవరూ అడ్డుకోరన్న ధైర్యంతో ముంతాజ్ హోటల్ పేరుతో ఒబెరాయ్ గ్రూప్ నిర్మాణాలు ప్ార ప్రారంభించింది.
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలిపిరిలో ముంతాజ్ అనే పేరుతో హోటల్ కట్టడం వివాదాస్పదమయింది. భూమన అయితే స్వాముల్ని పిలిపించి దీక్షలు చేయించారు. అసలు ఇచ్చిన వాళ్లే ఇలా చేయడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. టీడీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒబెరాయ్ గ్రూపును అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఒప్పించింది. టీటీడీకి మళ్లీ ఆ స్థలాన్ని అప్పగించింది. అయితే అసలు హోటల్ కు లీజుకిచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆ టీటీడీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు.