రాజన్న క్యాంటీన్లు ఏమయ్యాయి..?

తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన అన్నక్యాంటీన్లను కొత్త ప్రభుత్వం రాగానే నిలిపివేసింది. వాటితో పాటు రాజన్న క్యాంటీన్లు కూడా నిలిచిపోయాయి. అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించిన సమయంలో.. వైసీపీ నేతలు.. నియోజకవర్గాల వారీగా.. రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు. రోజా సహా… మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకూ పదుల సంఖ్యలో.. వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు..రాజన్న క్యాంటీన్లు పెట్టారు. అప్పట్లో అన్న క్యాంటీన్లు ఉన్నప్పటికీ.. వాటి వల్ల మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వారు పెట్టారు. కొంత మందికి రూ. నాలుగుకే భోజనం పెట్టారు. తాము వచ్చినా.. రూ.ఐదుకే భోజనం ఉంటుందని.. ఆ క్యాంటీన్ల ద్వారా నమ్మకం కలిగించారు.

ఇప్పుడు.. ఎక్కడా వారి క్యాంటీన్లు కూడా నడవడం లేదు. పేదలకు రూ. 5 భోజనం అందుబాటులో లేకుండా పోయింది. అదే సమయంలో.. ఇసుక కొరతతో.. భవన నిర్మాణ కూలీలకు పనులు లేకుండా పోయాయి. కనీసం అన్న క్యాంటీన్లలో ఆకలి తీర్చుకుందామనుకున్నా..ప్రయోజనం లేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… ప్రారంభించిన క్యాంటీన్లను అధికారంలోకి రాగానే ముసేశారు. ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లనూ క్లోజ్ చేశారు. అంటే.. తాము పెట్టడం లేదు.. ప్రభుత్వం తరపున పెట్టనివ్వడం లేదు.

ఇప్పటికీ టీడీపీ నేతలు పలు చోట్ల అన్న క్యాంటీన్లు పెట్టిన దగ్గరే.. దాతల సాయంతో…భోజన ఏర్పాట్లు చేశారు. ఉపాధి కోల్పోయిన కూలీలకు వీలైనంతగా… కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ కూడా ఆ ప్రయత్నం చేశారు. ప్రభుత్వం.. ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నప్పుడు..పోటీగా క్యాంటీన్లు పెట్టిన వైసీపీ నేతలు.. ఇప్పుడు వాటిని మూసేయడమే కాకుండా… భోజనం పెడుతున్న టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయం అంటే కడుపు నింపడం కాదు.. కడుపు కొట్టడం అంటే ఇదేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close