చైతన్య : పోలవరం ఊపిరి తీస్తే జగన్‌కేం ప్రయోజనం..!?

పోలవరం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం చేజేతులా… వివాదాల్లో నెట్టేసింది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరంపై… సొంత నిర్ణయాలు తీసుకుని… కేంద్రం ఆగ్రహానికి కారణం అవుతోంది. అదే సమయంలో… మరో 30శాతం కడితే పూర్తయ్యే దానికి మళ్లీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఖర్చు పెంచేస్తున్నారు. ఇప్పుడు.. పోలవరానికి సంబధించి అనేక సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం దాదాపుగా అసాధ్యం. అంటే.. పోలవరం ముందుకు తీసుకెళ్లడం అంటే.. అదోక యజ్ఞమే అవుతుంది.

“రివర్స్‌”తో పెరిగే ఖర్చును ఎవరు భరించాలి..?

పోలవరం ప్రాజెక్ట్‌ను.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సహా నాలుగు కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు పర్యవేక్షిస్తున్నాయి. అందుకే కేంద్రం.. ఆ ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు లేవని.. పార్లమెంట్ వేదికగానే ప్రకటించింది. అయినా…నిబంధనల ఉల్లంఘన పేరుతో  .. నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందంటూ… కాంట్రాక్టును రద్దు చేసి.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నారు. ఈ రివర్స్ టెండరింగ్ వల్ల ఖర్చు ఖచ్చితంగా పెరుగుతందని.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. పార్లమెంట్‌లోనే ప్రకటించారు. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమయ్యే అవకాశం ఉంది.  ఈ పెరిగే ఖర్చును ఎవరు భరించాలన్నది.. అక్కడ అసలు పాయింట్. కేంద్రం తమకు సంబంధమే లేదని చెప్పడం… రికార్డడే. మరి రాష్ట్రం భరిస్తుందా..?. ఉన్న పళంగా కాంట్రాక్టును రద్దు చేసి.. ఖర్చు పెంచుకుని కొత్త కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి..?

టెండర్లకు ఏళ్లు పూళ్లూ గడిచిపోవా…?  

నిబంధనల ప్రకారం.. టెండర్లను ఇంకా రద్దు చేయలేదు. టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. కానీ ఏపీ సర్కార్ కచ్చితంగా తీసేయాలనుకుంటోంది కాబట్టి.. ప్రస్తుతం పోలవరం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లందరూ.. వెళ్లిపోవడానికి రెడీ అయిపోయారు. మరి ఇప్పుడు. కొత్త టెండర్లు ఎప్పుడు పిలుస్తారు..? ఎప్పుడు ఆమోదిస్తారు..? ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు..? ఎప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు..? . లోక్‌సభలో గజేంద్ర సింగ్ షెకావత్ కూడా చెప్పారు. మళ్లీ కాంట్రాక్టులు ఎప్పుడు..  ఓకే చేస్తారో.. ఎప్పటికి పోలవరం పూర్తవుతుందోననే నిరాశను వ్యక్తం చేశారు. కచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ గడువుపై ఇది ప్రభావం చూపుతుందని అంటున్నారు. అదే జరిగితే.. రాష్ట్ర ప్రభుత్వం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

అసలు కేంద్రం రివర్స్ టెండరింగ్‌ను ఆమోదిస్తుందా..?
 
నిజానికి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చేతులెత్తేసిన తర్వాత చంద్రబాబు సర్కార్ కొత్త టెండర్లను పిలిచింది. కానీ కేంద్రం అంగీకరించలేదు. కొత్త టెండర్లంటే.. కచ్చితంగా అంచనాలు పెరుగుతాయని ఆ ఖర్చు ఎవరి భరిస్తారనే దీనికి కేంద్రం అడ్డుపుల్ల వేసింది. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి స్పందన చూసిన తర్వాత కచ్చితంగా.. ప్రాజెక్ట్ విషయంలో.. కేంద్రం అనేక కొర్రీలు పెట్టబోతోందని స్పష్టమవుతోంది. రివర్స్ టెండరింగ్‌కు.. కేంద్రం అంత తేలికగా అంగీకరించే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఓ రకంగా ఇప్పుడు… పోలవరం ప్రాజెక్ట్ … మధ్యలో ఆగిపోయింది. అటూ.. ఇటూ ముందుకు కదలించలేని స్థితికి చేరుతోంది. ఇది కచ్చితంగా ఆంధ్రకు అన్యాయం చేయడమే. ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే.. జగన్మోహన్ రెడ్డి ఇలా సొంత రాష్ట్రానికే చేటు చేస్తే.. భవిష్యత్ తరాలు ఎప్పటికీ క్షమించవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close