అమిత్ షాతో ఆంధ్రజ్యోతి ఆర్కే భేటీ..! లోగుట్టు చాలా ఉందా..?

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి… కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా ఆహ్వానం మేరకే ఢిల్లీ వెళ్లినట్లుగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రకటించుకుంది. కొద్ది రోజుల క్రితం.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్‌లలో రాధాకృష్ణను కలిశారు. అప్పుడే.. అమిత్ షాతో భేటీ ఏర్పాటుకు బీజం పడి ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దు గురించి అధికారికంగా అమిత్ షా, ఆర్కే మాట్లాడుకుని ఉండవచ్చు కానీ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి చర్చ జరగకుండా ఉంటుందంటే ఊహించలేం. బీజేపీకి మద్దతుగా కొన్ని కీలక ప్రతిపాదనలు.. ఆర్కే చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

మిత్రుల కోసం రాయబారానికి వెళ్లారా..?

వేమూరి రాధాకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. వారి సాన్నిహిత్యం దశాబ్దాల నాటిది. ఇక ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుతోనూ మిత్రుత్వం ఉంది. అయితే.. కేసీఆర్ తో ఉన్న స్నేహానికి అది భిన్నం. ఏ కోణంలో చూసినా.. ఇద్దరితోనూ… సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎదగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడిప్పుడే.. పుంజుకుంటుందన్న భావన కలిగిస్తోంది. అయితే మీడియా సపోర్ట్ లేదు. బహుశా.. ఆర్కే.. తెలంగాణలో బీజేపీకి మద్దతుగా.. తన వంతు సహకారం అందిస్తానని అభయం ఇచ్చి ఉండవచ్చని చెబుతున్నారు. మిత్రుడు కేసీఆర్ ను మరీ శత్రువుగా చూడాల్సిన పని లేదనే ప్రతిపాదన పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. తను పత్రికలో రాసే వారాంతపు ఆర్టికల్‌లో … మోడీతో భేటీలో కేసీఆర్.. తనను శత్రువుగా పరిగణించవద్దని విజ్ఞప్తి చేసినట్లుగా చెప్పకనే చెప్పారు.

టీడీపీకి మాట సాయం చేశారా..?

ఇక రాధాకృష్ణ .. తెలంగాణ కంటే… ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూంటారు. తెలుగుదేశం పార్టీ అధినేతకు.. రాధాకృష్ణ .. అనధికారికంగా రాజకీయ సలహాదారుగా ఉన్నారు. బీజేపీతో సంబంధాలు తెంపుకోవడంలో… ఆర్కే పాత్ర ఉందన్న ప్రచారం.. కొన్నాళ్లుగా సాగింది. ఆయన పత్రికలో బీజేపీపై ఆ స్థాయిలో వ్యతిరేక ప్రచారం జరిగేది. అయితే.. బీజేపీతో పొత్తు వదులుకోవడం మంచిదని మాత్రం.. ఎప్పుడూ.. తన పత్రికలో చెప్పలేదు. పైగా.. బీజేపీకి కటిఫ్ చెప్పడం వల్ల.. నష్టమే జరుగుతుందని.. తన అభిప్రాయాలను చాలా సార్లు ఆర్టికల్స్‌లో వెల్లడించారు. ఇప్పుడు… టీడీపీ .. మరోసారి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు దగ్గర కాకపోయినా… శత్రువు అనే భావన తగ్గించుకునే ప్రయత్నం .. చేస్తోంది. ఈ క్రమంలో.. ఆర్కే తన వంతు సాయం చేశారన్న చర్చ జరుగుతోంది.

ఏపీ సర్కార్ వేధింపులకు చెక్ పెట్టే ప్రయత్నమా..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పాలనను ఆయన మొదట్లో విమర్శించలేదు కానీ.. రెండు నెలల్లోనే.. పరిస్థితి తేలిపోవడం… తన మిత్రుడైన కోడెల శివప్రసాదారవును ఆత్మహత్య చేసుకునేంతగా వేధింపులకు గురి చేయడంతో ప్రభుత్వ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ ఆగడాలను ఎదుర్కోవాలంటే.. బీజేపీ మద్దతు తప్పని సరి అని అంచనా వేసినట్లుగా చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఇబ్బందులు పడిన మొదటి వ్యక్తి రాధాకృష్ణ. నిబంధనల ప్రకారం.. తన పత్రికకు, చానల్‌కు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇవ్వడం లేదు. అదే సమయంలో కేబుల్ ఆపరేటర్లను బెదిరించి మరీ చానల్‌ను నిలుపుదల చేయించారు. టీడీశాట్ ఆదేశాలిచ్చినా ఫైబర్ నెట్‌లో ప్రసారాలు చేయడం లేదు. ఈ క్రమంలో అమిత్ షా భేటీతో మార్పు కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి ఎన్నో సమస్యలకు ఒక్క ఫోటో సమాధానం చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close