ప్రొ.నాగేశ్వర్ : ఆర్థిక వ్యవస్థను మోడీ మరింతగా దిగజార్చారా..?

2014లో యూపీఏ -2 ఓడిపోవడానికి ప్రధాన కారణం.. అప్పటి ఆర్థిక వ్యవస్థ. ఎకనామిక్ పెరాలసిస్.. ఆప్పట్లో ఆర్థిక వ్యవస్థకు పశ్చవాతం వచ్చేసింది.. మళ్లీ పునర్జీవం రావాలంటే.. ఎన్డీఏ రావాల్సిదేనని.. ప్రచారం చేశారు. మోడీ వస్తే.. దేశానికి మంచి జరుగుతుందని ప్రచారం చేశారు. అంతా అనుకూలమైన వాతారవణం ఏర్పడుతుందన్నారు. ప్రజలు కూడా అప్పటి పరిస్థితిల్లో నమ్మక తప్పలేదు. మోడీని గెలిపించారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది..?

పన్నులు పెంచి పెట్రో బాదుళ్లతో ప్రజల లూటీ..!

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని తీసుకుంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. 2014కి ముందు అంటే మోడీ ప్రధానికాక ముందు.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర.. 140 డాలర్ల వరకు ఉంది. ఆ తర్వతా అది 25 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత కొంచెం పెరిగింది. ఇప్పుడు 70 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. ఇంత దారుణంగా క్రూడాయిల్ ధరలు పడిపోయినా.. ఆ ప్రయోజనం భారత ప్రజలకు బదలాయించలేదు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 మే నుంచి 2016 జూన్ వరకు.. తొమ్మిసార్లు.. ఎక్సయిజ్ టాక్స్ పెరిగింది. దాదాపుగా లీటర్‌పై రూ. 10కిపైనే టాక్స్ పెంచారు. అప్పుడు చములు ధరలు బాగా తగ్గాయి. అప్పుడు ధరలు తగ్గిస్తే.. మళ్లీ పెరిగినప్పుడు ప్రజలు భరించలేరన్న కారణంతో కేంద్రం ఎక్సయిజ్ పన్నును పెంచింది. ఈ మధ్యలో బడ్జెట్‌లో రెండు టాక్స్ తగ్గించారు. కానీ సెస్ విధించారు. ఈ సెస్ ద్వారా.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కోత కోశారన్నమాట.

ప్రజలపై పెద్ద బండలేసిన జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలు..!

ఇక డీఎస్టీ, నోట్ల రద్దు లాంటి కీలక నిర్ణయాలను… ప్రభుత్వం తీసుకుంది. జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. గత ఏడాది జీఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోయిన మొత్తం రూ. 48, 178 కోట్ల రూపాయలు రాష్ట్రాలు నష్టపోయాయి. జూలై – ఆగస్టు 2018లో రూ. 13వేల కోట్లు నష్టపోయాయి. అంటే.. ఏ స్థాయిలో ఈ నష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక… నోట్ల రద్దు వల్ల వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన జీడీపీ గణాంకాల ప్రకారం… పదేళ్ల కాలం యూపీఏ పాలనతో పోలిస్తే.. నాలుగేళ్ల ఏన్డీఏ పాలనతో.. జీడీపీ చాలా తక్కువగా నమోదయింది. ఇవి అధికారిక లెక్కలే. నోట్ల రద్దుకు ముందు కొంత మెరుగ్గా వృద్ధి రేటు ఉండేది. నోట్ల రద్దు చేసిన తర్వాత ఈ వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. నోట్ల రద్దు వల్ల ఏ ప్రమాదం లేదని చెబుతున్నారు. కానీ మోడీ పదవి చేపట్టిన మొదట్లో 8.1 శాతం ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు ఏడు శాతానికి ఎందుకు పడిపోయింది. రాను రాను.. ఈ వృద్ధి రేటు పడిపోతోందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే… నోట్ల రద్దు వల్ల.. అసంఘటిత రంగం పూర్తిగా ఇబ్బందుల్లో పడిపోయింది.

నోట్ల రద్దుతో వైట్‌గా మారిన బ్లాక్‌మనీ..!

నోట్ల రద్దు తర్వాత బ్లాక్ మనీ ఏమైనా బయటకు వచ్చిందా అంటే అదీ లేదు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత.. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో జమ చేస్తారు. అలా లెక్కల్లో లేని నల్లధనం.. జమ అయితే.. ఎక్కడి నుంచి వచ్చిందో.. ప్రభుత్వం తెలుసుకుంటుంది. నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో … పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు.. ఎంత మొత్తం నల్లధనం.. ఎంత వరకూ వెనక్కి రాదని భావిస్తున్నారని అని ప్రశ్నించింది. అప్పుడు ప్రభుత్వం రూ. మూడు లక్షల కోట్ల వరకూ బ్లాక్ మనీ ఉంటుంది. ఇవి బ్యాంకుకు తిరిగి రావని.. చెప్పింది. రూ. 15 లక్షల కోట్ల పెద్ద నోట్లు ఉంటే.. రూ. 12 లక్షల కోట్లు మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చింది. కానీ.. రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. నోట్ల రద్దు చేసిన రోజు… దేశంలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15 లక్షల 41వేల కోట్లు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడిన… రూ. 15 లక్షల 31వేల కోట్లు తిరిగి వచ్చాయి. అంటే..99.3 శాతం తిరిగి వచ్చాయి. భారత ఆర్థిక వ్యవస్థలో యాభై శాతం నల్లధనం ఉంటుందని నిపుణలు అంచనా వేస్తూంటే.. 0.7 శాతం మాత్రమే… వెనక్కి రాలేదు. ఈ మొత్తంలోనూ.. సమయానికి బ్యాంకుల్లో వేసుకోని వాళ్లు కూడా ఉన్నారు. రూ. పది వేల కోట్లు మాత్రమే. ఇది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ .

ఒక్క నల్ల కుబేరుడ్నీ పట్టుకోలేదు..!

నల్లధనంగా చెప్పుకునే ఈ రూ.పది వేల కోట్లను పట్టుకోవడానికి కోట్లాది మంది భారతీయుల్ని ఇబ్బందులు పెట్టారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోయింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమాలు ఘారంగా దెబ్బతిన్నాయి. అసంఘటిత రంగం మొత్తం కుదేలయంది. రూ. పది వేల కోట్ల నల్లధనం కోసమే.. ఇంత చేయడం అవసరమా..? ఇంత మనీ వెనక్కి వచ్చిన తర్వాత కేంద్రం మరో వాదన తీసుకు వచ్చింది. బ్యాంకుల్లో డిపాజిట్ అయినంత మాత్రాన.. అంతా న్యాయబద్ధమైన డబ్బులు కాదని.. అందులోనే నల్లధనం ఉంది. పట్టుకుంటామని కేంద్రం ప్రకటించింది. అది మాత్రం నిజమే. బ్యాంకుల్లో డిపాజిట్ అయినంత మాత్రాన వైట్ మనీ కాదు. కానీ.. డిమానిటైజేషన్ అయిపోయి… దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ మధ్య కాలంలో ఎంత నల్లధనాన్ని పట్టుకున్నారు..?. ఎవర్ని పట్టుకున్నారు..? ఫలానా వాళ్లు.. బ్లాక్‌మనీ డిపాజిట్ చేశారని ఒక్కర్నైనా గుర్తించారా..? ఇంత వరకూ ఒక్కరిని కూడా కేంద్రం గుర్తించలేదు. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి… ప్రభుత్వం కల్పించిన చట్టబద్దమైన అవకాశం… నోట్ల రద్దుగా మారింది. దీని వల్ల చట్టబద్ధంగా సంపాదించుకునే సామాన్యుడి వృత్తి, ఉపాధి దెబ్బతిన్నది. దీనిపై జీఎస్టీ… పడి… చిన్న, మధ్యతరహా పరిస్థితులు తీవ్రంగా దెబ్బతున్నాయి. అంటే.. ఒకటిన్నర శాతం. జీడీపీ దెబ్బతిన్నది. అంటే.. కొన్ని లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నమాట.

తగ్గిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు..!

చమురు దిగుమతులకు మనం డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఓ వైపు విదేశీ పెట్టుబడులు వెనక్కి పోయి డాలర్లు తగ్గిపోతున్నాయి. మరో వైపు చమురు ధరలు పెరిగి డాలర్లలో ఎక్కువ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. రూపాయి పతనం వల్ల కూడా డాలర్లు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. రోజువారీ విదేశీమారక ద్రవ్యం ఎంత సంపాదిస్తున్నాం.. ఎంత ఖర్చు పెడుతున్నామన్నది కూడా ముఖ్యమే. ఈ రెండింటి మధ్య గ్యాప్ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అంటారు. ఇది యూపీఏ హయాంలో త్రీ పర్సంట్ దాటి.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కారణం అయింది. ఇది మోడీ వచ్చాక బాగా తగ్గింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ఇది రెండు శాతంగా ఉంది. రూపాయి పతనం అవుతూ ఉంటే.. ఇది ఇలాగే ఉండటం అవసరం. ఇది మూడు శాతానికి మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పుడు అత్యధిక నిరుద్యోగిత ఎక్కువ ఉన్న దేశంగా.. ఐఎల్‌వో నిర్దారించింది.

బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండి బాకీలు..!

ఇక బ్యాంకుల్లో మొండి బాకీల్లో పెరుగుతున్నాయి. 2018 మార్చి నాటికి భారతీయ బ్యాంకుల మొండి బాకీలు రూ. 10 లక్షల కోట్లు దాటాయి. 2014లో ఇవి రూ. 2లక్షల కోట్లు మాత్రమే. మొండి బాకీలు అంటే… నాన్ పెర్మార్మింగ్ అసెట్స్. 90 రోజుల పాటు.. అటు అసలు కానీ.. వడ్డీ కాని కట్టి రుణాలు మొండి బాకీలుగా పేర్కొంటారు. ఇలా మొండి బాకీల లెక్కల్లో బ్యాంకులు రాసుకున్న వాటిల్లో కనీసం పది శాతం కూడా వసూలు కావని బ్యాంకుల రికార్డులు చెబుతున్నాయి. రూ. 10 లక్షల కోట్ల మొండిబాకీలు అంటే.. బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో 11.2 శాతం. ఇక స్ట్రెస్ ఎస్సెట్స్ అంటే… మొండి బాకీలు అవడానికి దగ్గరగా వచ్చినవి. ఇవి రూ. 14.7 లక్షల కోట్లు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్… అత్యధికంగా స్ట్రెస్ అసెట్స్ ఉన్న దేశం అని.. అని ప్రకటించింది. ఇటలీ రెండో స్థానంలో ఉంది. బ్యాంకింగ్ ఇండస్ట్రీ పరిస్థితి అలా తయారయింది.

కింద చూపులు చూస్తున్న జీడీపీ..!

జీడీపీ పతనమయింది. నిరుద్యోగిత పెరిగింది. చిన్న , మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కరెంట్ డెఫిషిట్ అకౌంటర్ పతనమైంది. బ్యాంకింగ్ రంగం కుదేలైంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. రూపీ ఇష్టారాజ్యంగా పతనమవుతోంది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా రూపీ డాలర్‌తో పోలిస్తే.. రూ. 71కి పడిపోయింది. ద్రవ్యోల్బణం…5.2కి పెరిగింది. ఇంకా పెరుగుతుంది. రూపాయి పతనం అవుతున్న కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇలా ద్రవ్యోల్బణం పెరిగితే.. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. ఇలా పెరిగితే.. పెట్టుబడులు తగ్గిపోతాయి. అంతే.. ఎలా చూసినా… భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం దిశగా ఉంది. కానీ బీజేపీ నేతలు మాత్రం అంతర్జాతీయ పరిణామాలను కారణంగా చూపిస్తోంది. కానీ అది నిజం కాదు. 2014లో ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తామని చెప్పి వచ్చిన బీజేపీ ఆర్థిక వ్యవస్థను మరింతగా చెడగొట్టింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close