[X] Close
[X] Close
Home రాజకీయాలు కోదండరామ్ ఎక్కడున్నారు...! ఏం చేస్తున్నారు..!

కోదండరామ్ ఎక్కడున్నారు…! ఏం చేస్తున్నారు..!

కోదండరామ్. తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రొఫెసర్. గత ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మహా కూటమిలో ప్రధాన భూమిక పోషించిన నాయకుడు. కొన్నాళ్ల పాటు వ్యక్తిగతంగా ఎదిరించినా.. ఆ తర్వాత ఏకంగా తెలంగాణ జన సమతి పేరుతో రాజకీయ పార్టీనే పెట్టి కేసీఆర్ కు ఎదురొడ్డిన నాయకుడు. తెలంగాణలో కళాకారులు, మేథావులు, మధ్యతరగతి బుద్ధి జీవులు తనకు మద్దతుగా నిలబడ్డారని, వారి ద్వారా తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ బారి నుంచి తప్పిస్తానని ప్రకటనలు సైతం గుప్పించారు. అక్కడి వరకూ బాగానే ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్షాలతో కూడిన మహాకూటమితో చేతులు కలిపి బరిలో నిలిచారు. అయితే ఎన్ని పార్టీలు కలిసినా కేసీఆర్ దూకుడును ఆడ్డుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారీ మెజార్టీతో గెలవడం, తిరిగి కేసీఆరే ముఖ్యమంత్రి కావడంతో మహాకూటమి నాయకులు మూటముల్లె సర్దుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అప్పటి నుంచి కోదండరామ్ కూడా ఎక్కడా ఉలుకు పలుకూ లేకుండా సైలెంట్ అయ్యారు. ఆ మధ్య ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే, దీనికి కార్యకర్తల నుంచే కాదు… తెలంగాణ సమాజం నుంచి కూడా పెద్దగా స్సందన రాలేదు. దీంతో ఆ కార్యక్రమాన్ని కోదండరామ్ వాయిదా వేసుకున్నారు. గడచిన ఐదారు నెలలుగా కోదండరామ్ ఇంటికే పరిమితమైపోయారు తప్ప పార్టీ నాయకులకు కాని, కార్యకర్తలకు కాని ఎలాంటి దిశానిర్దేశం చేయడం లేదు. నిజానికి కోదండరామ్ ఎలాంటి సమావేశాలకు హాజరుకావడం లేదు. కనీసం పార్టీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయడం లేదని పార్టీ సీనియర్ నాయకులు వాపోతున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, పార్టీ తిరిగి పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడైన కోదండరామ్ పై ఉందని వారంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో అన్ని పార్టీలు విఫలం అవుతున్నాయనే అభిప్రాయం ఉంది. ఇలాంటి సమయంలో రానున్న మూడున్నరేళ్లు ప్రజల కోసం ఉద్యమిస్తే, వారి సమస్యలపై పోరాటం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే, కోదండరామ్ వంటి మేథావులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఇంటికే పరిమితం కావడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎలాంటి ఉద్యమాలు చేసినా కేసీఆర్ ను ఎదుర్కోలేమనే నిరాశలోకి కోదండరామ్ వెళ్లిపోయారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి కోదండరామ్ మౌనం పార్టీ నాయకులు, కొద్దోగొప్పో మిగిలిన కార్యకర్తలు, మేథావులకు మింగుడుపడడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

తెలంగాణలో బహిరంగంగా ఉమ్మి వేసినా కేసు..!

వైరస్ అంకంతకూ వ్యాపిస్తూండటంతో తెలంగాణ సర్కార్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో పాన్‌, తంబాకు ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి...

ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యమే అసలు వైరస్..!

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన నలుగురు వైద్య సిబ్బందికి వైరస్ సోకింది. దీనికి కారణం.. పూర్తి నిర్లక్ష్యమే. హిందూపురానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చనిపోయాడు. అయితే.. ఈ...

“మెడ్‌టెక్ జోన్” క్రెడిట్ కోసం వైసీపీ ఆరాటం..!

వైరస్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా.. దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది విశాఖ మెడ్‌టెక్ జోన్. సాధారణంగా ఏపీలో  పొలిటికల్ క్రెడిట్ గేమ్స్ చాలా ఎక్కువ. ఇలాంటి ఓ అరుదైన...

ఆ వార్త‌ల్లో నిజం లేద‌న్న మారుతి

`ప్ర‌తిరోజూ పండ‌గే`తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టాడు మారుతి. సాయిధర‌మ్ తేజ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌. దాంతో మారుతి త‌దుప‌రి సినిమాపై మ‌రింత ఫోక‌స్ ప‌డింది. ర‌వితేజ‌, రామ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌......

HOT NEWS