ఏపీ బీజేపీ గురించి పట్టించుకునే మీడియా ఏది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఇప్పుడు గింజుకుంటున్నారు. గతంలో ఏదో ఓ మీడియాలో కవరేజీ వచ్చేది. ఇప్పుడు ఏ మీడియాలోనూ వారు కనిపించడం లేదు. గతంలో ఆంధ్రజ్యోతినే ఎంతో కొంత కవరేజీ ఇచ్చేది. ఇప్పుడు ఆ చాన్స్ లేకుండా పోయింది. వారే స్వయంగా ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయడంతో ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. తిరుపతి ఉపఎన్నికల నేపధ్యంలో సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ మీడియాలోనూ వారి హడావుడి కనిపించడం లేదు. గతంలో అలా ఉండేది కాదు. ఇప్పుడు… ఎన్నికల షెడ్యూల్ వచ్చినా… అసలు బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తుందో కూడా పట్టించుకునే తీరిక లేదు. జనసేన పార్టీ సీటును త్యాగం చేసేసింది. అప్పుడు కావాల్సినంత హైప్ రావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా భిన్నం. పార్టీల వారీగా చీలిపోయింది. ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా.. ఒక్క న్యూస్ మాత్రమే రిపోర్ట్ చేస్తూ ఈటీవీ ఒక్కటే కాస్త తటస్థంగా కనిపిస్తూ ఉంటుంది మిగతా చానళ్లలో బీజేపీకి కవరేజీ కావాలంటే… ఆయా పార్టీలకు అనుకూలమైన ప్రకటనలు లేదా.. తమకు దగ్గరగా ఉన్న పార్టీకి వ్యతిరేక పార్టీపై విమర్శలు చేయాలి. అలా అయితేనే కవరేజీ వస్తుంది. అలా చేయడం వల్ల.. ఆ పార్టీలకు మాత్రమే లాభం కానీ .. బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. ఇప్పుడు బీజేపీ ఉపఎన్నికల బరిలో దిగింది. ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది మీడియా అండ. బీజేపీకి అంతో ఇంతో సపోర్ట్‌గా నిలిచే ఆంధ్రజ్యోతి కవరేజీ లేకపోవడంతో.. ఆ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది.

తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం కోసం ఇప్పుడు బీజేపీ వెంపర్లాడాల్సిందే. ఎందుకంటే… వైసీపీ అనుకూల మీడియాలో ఇక బీజేపీకి చోటు దక్కదు. ఎందుకంటే.. ఆ పార్టీ భారీ మెజార్టీపై కన్నేసింది. ఏమైనా ఢిల్లీ స్థాయిలో అండర్ స్టాండింగ్ పెట్టుకుని కవరేజీ ఇవ్వాలన్న రూల్ ఉంటే తప్ప కవరేజీ రాదు. ఇక టీడీపీ అనుకూల మీడియాను ఓ రకంగా బీజీపేనే దూరం పెట్టింది. ఇక సోషల్ మీడియాలోనూ ఆ పార్టీ అంత చురుకుగా లేదు. ఏతావాతా చివరికి… తన కోపమే తనకు శత్రువన్నట్లుగా బీజేపీ మీడియా కేవరేజీకి గండి పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢీ 2 కాదు.. దూకుడు 2 రాదు!

సీక్వెల్స్ హావా తెలుగులో జోరుగానే ఉంది. దానికి తోడు ఇప్పుడు పార్ట 2లు సీజ‌న్ కూడా న‌డుస్తోంది. శ్రీ‌నువైట్ల `ఢీ`కి సీక్వెల్ వ‌స్తుంద‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. శ్రీ‌నువైట్ల - విష్ణు కాంబినేష‌న్...

మోహ‌న్‌బాబు కోసం చిరు.. మ‌రోసారి!

చిరంజీవి - మోహ‌న్ బాబు మ‌ధ్య ఓ విచిత్ర‌మైన బంధం ఉంటుంది. ఇద్ద‌రూ బ‌య‌టి ప్ర‌పంచానికి ఎడ‌మొహం - పెడ‌మొహంలా క‌నిపిస్తారు. కానీ.. నిజ జీవితంలో ఇద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్ లా మెలుగుతుంటారు....

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

HOT NEWS

[X] Close
[X] Close