రుణమాఫీ కాని వారికి మరో చాన్స్

రుణమాఫీ అర్హులైన వారికీ చేయలేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. అర్హత ఉన్నా.. రుణమాఫీ కోసం కాని రైతుల‌కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఆధార్‌లో తప్పులుంటే.. ఆధార్‌కు బదులుగా ఓటరు లేదా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

రేషన్ కార్డు లేకపోతే రైతుల కుటుంబాలకు సర్వే నిర్వహిస్తారు. బ్యాంక్ ఖాతాలో వ్యత్యాసాలను సరిచేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇప్పటికీ మూడు విడతల్లో రెండు లక్షల వరకూ రుణమాఫీ చేశారు. అయితే ఇంకా వేల మందికి రుణమాఫీల కాలేదన్న ఫీడ్ వస్తోంది.

నియోజకవర్గాల వారీగా ఇలాంటి వారు ఎక్కువ మంది ఉండటంతో అడ్వాంటేజ్ తీసుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ రెడీ అయిపోయాయి. మోసం చేశారన్న ఆరోపణలతో రుణమాఫీ కాని వారిని రోడ్ల మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు .. చిన్న చిన్న కారణాలతో రుణమాఫీ కాని వారికి మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు … ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. నాణ్యమైన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న మద్యం...

జ‌న‌సేన‌లోకా… కాంగ్రెస్ గూటికా… బాలినేని దారెటు?

అదిగో రాజీనామా... ఇదిగో రాజీనామా... వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పేస్తారు అంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. వైసీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు, జ‌గ‌న్ పై అసంతృప్తి అన్నీ క‌లిసి......

వైసీపీకి బిగ్ షాక్… బాలినేని రాజీనామా!

ఎన్నో రోజులుగా ఉన్న అసంతృప్తి... జ‌గ‌న్ ఎన్ని రాయ‌బారాలు పంపినా బాలినేని ఆగ‌లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతార‌న్న పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నిక‌లకు ముందు...

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చివేయండి… హైకోర్టు కీల‌క ఆదేశాలు

బీఆర్ఎస్ పార్టీ అనుమ‌తి లేకుండా పార్టీ ఆఫీసును నిర్మించింద‌ని దాఖ‌లైన పిటిష‌న్ పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. 15రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చివేయాల‌ని స్ప‌ష్టం చేసింది. న‌ల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close