ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ చిత్రీకరణ దాదాపుగా పూర్తయిపోయింది. ప్యాచ్ వర్క్ మినహా… మిగిలిన పనులన్నీ అయిపోయినట్టే. `కథానాయకుడు` కి లాక్ పడిపోయింది. ఫైనల్ కట్ కూడా పూర్తయింది. ఇప్పుడు `మహా నాయకుడు` కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈలోగా.. నందమూరి బాలకృష్ణ పాత్రని ఎవరు పోషించారు? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణకు సంబంధించిన పాత్ర చాలా చిన్నదే అని చెప్పుకోవాలి. కాకపోతే.. ఒకట్రెండు సన్నివేశాల్లో బాలయ్య కనిపించే అవకాశం వచ్చింది. ఈ పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు భావించారు. క్రిష్ ప్రయత్నం కూడా అదే. గత కొన్ని రోజుల నుంచీ `ఎన్టీఆర్` బయోపిక్‌లో మోక్షజ్ఞకు కూడా స్థానం దక్కిందని, బాలయ్యపాత్రలో మోక్షజ్క్ష కనిపించాడన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది,.
అయితే.. అలాంటి షాకులేం ఈ సినిమాలో లేవు. నందమూరి బాలకృష్ణ పాత్రలో బాలయ్యే నటించాడు. అది కూడా ఒకట్రెండె సన్నివేశాల్లో మాత్రమే. అంటే.. ఈ సినిమాలో బాలయ్యది డ్యూయల్ రోల్ అనుకోవాలన్న మాట. ఈ బయోపిక్‌లో తొలి భాగం జనవరి 9న, రెండో భాగం ఫిబ్రవరి తొలి వారంలోనూ విడుదల కానున్నాయి.