జయరాం హంతకుడు రాకేష్‌ !? మరి శిఖా చౌదరి పాత్రమిటి..?

ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు మలుపులు తిరుగుతోంది.  జయరాం మేనకోడలు శిఖాచౌదరి .. ఎక్స్ బాయ్ ఫ్రెండ్.. రాకేష్ రెడ్డినే హత్య చేశారని… పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాకేష్ జయరాంకు.. రూ. నాలుగున్నర కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారని.. వాటికి ఓ నెల వడ్డీ కట్టని కారణంగానే.. హత్య చేశారని… శిఖా చౌదరి పోలీసులకు చెబుతున్నారు. కానీ.. ఒక్క నెల వడ్డీ కట్టకపోతే చంపేస్తారా.. అన్న సందేహం పోలీసులను వెంటాడుతోంది. శిఖా చౌదరిని నిన్నటి నుంచి సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఆమె చెప్పిన వివరాలు ఆధారంగా.. పలు చోట్ల సోదాలు.. చేసి.. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. హంతకుడు రాకేష్ రెడ్డి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

శిఖాచౌదరి..  తన మామయ్య… చిగురుపాటి జయరాంకు పూర్తి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసు వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. ఆయనో ఉమనైజర్ అని.. ఆయన దగ్గర డబ్బుల్లేవని.. అప్పులు చేశారని.. వాటిని కట్టడానికే…ఇబ్బందులు పడుతున్నారని.. శిఖాచౌదరి వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్నారు.  మేనకోడలినైన తనతో కూడా.. లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని.. తన చెల్లిని కూడా.. వేధించాడని.. శిఖా చెప్పినట్లు తెలుస్తోంది. తన చెల్లికి రూ. రెండు కోట్లు పెట్టి.. మెడికల్ సీటు ఇప్పించిన మాట నిజమేనని అంగీకరించారు. రెండు సార్లు పెళ్లి చేసుకుని.. రెండు సార్లు విడాకులు తీసుకున్నానని శిఖా పోలీసులకు చెప్పారు. రెండో డైవోర్స్ తర్వాత రాకేష్ రెడ్డితో.. డేటింగ్ చేసి.. పెళ్లి చేసుకుందామనుకునేలోపు… విబేధాలొచ్చి విడిపోయారు. అప్పుడే శ్రీకాంత్ అనే మరో యువకుడితో పరిచయం కావడంతో.. అతడితో శిఖా డేటింగ్ ప్రారంభించారు. జయరామ్ హత్య జరిగిన రోజున.. శ్రీకాంత్ తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లానని.. హత్య విషయం తెలిసిన తర్వాత.. తన పేరుపై ఉన్న ఆస్తి తాలూకా పత్రాల కోసం… జయరామ్ ఇంటికి వెళ్లి వాచ్‌మెన్‌తో గొడవపడినట్లు శిఖా అంగీకరించినట్లు.. పోలీసులు చెబుతున్నారు. చెక్‌పవర్ మొత్తం జయరామ్ భార్య దగ్గరే ఉండటం వల్ల ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని శిఖావాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసు వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

మొత్తానికి జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డి హంతకుడిగా కనిపించినప్పటికీ.. అసలు శిఖాచౌదరి తీరే అనుమానాస్పదంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందరూ .. కలిసే.. ప్లాన్డ్‌గా చేసి ఉంటారని.. పోలీసులు అంచనాకు వస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను…పోలీసులు ఇప్పటికే సేకరించారు. కొన్ని కీలక అరెస్టుల తర్వాత… మొత్తం వివరాలు పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com