‘లైగ‌ర్‌’లో అదిరిపోయే ఐటెమ్ సాంగ్‌.. మ‌రి ఎవ‌రితో?

పెద్ద సినిమా అంటే ఐటెమ్ గీతం మ‌స్ట్ అయిపోయింది. `పుష్ప‌` లో స‌మంత ఐటెమ్ గీతం ఎంత మైలేజ్ ఇచ్చిందో తెలిసిందే. సినిమాల‌కు అది అద‌నపు ఆక‌ర్ష‌ణ అయిపోతోంది. `లైగ‌ర్‌` కోసం కూడా అదిరిపోయే ఐటెమ్ గీతం రెడీ అయిపోయింద‌ట‌. పూరి – విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. పూరి సినిమా అంటే.. ఐటెమ్ గీతం త‌ప్ప‌నిస‌రి. ఆయ‌న ఐటెమ్ పాట‌ని స‌రికొత్త పంథాలో డిజైన్ చేయ‌గ‌ల‌డు. `పోకిరి`లో `ఇప్ప‌టికింకా నా వ‌య‌సే` ఎంత ప్ర‌భంజ‌నం సృష్టించిందో తెలిసిందే. అప్ప‌టి నుంచీ పూరి సినిమాలో ఐటెమ్ గీతాల‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. `లైగ‌ర్‌`లోనూ ఆ సెంటిమెంట్ కొన‌సాగించాల‌ని చూస్తున్నారు.

అయితే ఈ పాటలో న‌ర్తించ‌డానికి ఓ స్టార్ హీరోయిన్ కావాలి. త‌న కోసమే పూరి టీమ్ గ‌ట్టిగా అన్వేషిస్తోంది. పూరితో చాలామంది స్టార్ హీరోయిన్లు ప‌నిచేశారు. వాళ్లెవ‌రిని అడిగినా కాద‌న‌రు. అయితే… ఇప్ప‌టి వ‌రకూ ఐటెమ్ పాట‌లో క‌నిపించ‌ని క‌థానాయిక‌తోనే ఈ పాట చేయించాల‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. ఓ ర‌కంగా ఇది కూడా `పుష్ప‌` స్ట్రాట‌జీనే అనుకోవాలి. అస‌లు ఐటెమ్ గీత‌మంటేనే ఎరుగ‌ని స‌మంత‌తో ఆ పాట చేయించి, ఇంకాస్త మైలేజీ తెచ్చుకున్నాడు సుకుమార్‌. పూరి కూడా ఇలానే భావిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఐటెమ్ సాంగ్ చేయ‌ని క‌థానాయిక‌తో ఈ పాట తెర‌కెక్కించాల‌ని చూస్తున్నాడు. మ‌రి ఆ లిస్టులో ఎవ‌రున్నార‌బ్బా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్యాడర్ పార్టీ టీడీపీ మరో సారి ఫ్రూవ్ !

దారుణ పరాజయం.. ఆ తర్వాత వేధింపులు.. ఆర్థిక మూలాలు దెబ్బకొట్టుడు.. చివరికి స్థానిక ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని నిస్సహాయత... ఇలాంటి పరిస్థితుల్లో నేతలంతా జావకారిపోయారు. కానీ.. క్యాడర్ మాత్రం అంతే ఉంది....

ఇప్పుడు ఎన్టీఆర్ అందరి వాడు !

నిన్నామొన్నటిదాకా ఎన్టీఆర్ అంటే టీడీపీ సొత్తు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎన్టీఆర్ అంటే అందరి వాడు. ఏపీలో వైసీపీ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజును నిర్వహించింది. విజయవాడతో పాటు పలు...

ఖర్చు లేకుండా పార్టీ నడుపుతున్న వైసీపీ !

రాజకీయ పార్టీ నడపడం అంటే మాటలా ? రూ. కోట్లకు కోట్లు కావాలంటారు. అయితే వైసీపీ మాత్రం అసలు ఖర్చే లేకుండా పార్టీని నడుపుతోంది. ఈ విషయాన్ని వైసీపీనే చెబుతోంది....

ఆత్మకూరు బరిలో ఆనం కుమర్తె !

ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన సందర్భంలో ఆసక్తికరంగా పరిణామాలు మారుతున్నాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ కుమార్తె కైవల్యారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి లోకేష్‌తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close