అగ్నిప్రమాదంలో డాక్టర్లదే తప్పా.. అనుమతిచ్చిన వారు పరిశుద్ధులా..?

విజయవాడ అగ్నిప్రమాద ఘటనలో డాక్టర్లను అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉత్సాహం చూపిస్తూండటం తీవ్రంగా విమర్శల పాలవుతోంది. రమేష్ ఆస్పత్రి చైర్మన్ పోతినేని రమేష్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆయన పరారీలో ఉన్నారని మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఆయన కోసం హైదరాబాద్‌లోనూ వెదుకుతున్నామని చెబుతున్నారు. అలాగే స్వర్ణా ప్యాలెస్ ఓనర్‌నూ అరెస్ట్ చేస్తామని ఆయన కూడా.. పరారీలో ఉన్నారని చెబుతున్నారు. డాక్టర్ రమేష్ బాబు విషయంలో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వైద్యుల ఆగ్రహానికి కారణం అవుతోంది. ఆయనను అరెస్ట్ చేయవద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డీజిపికి లేఖ రాసింది. ఇప్పటికే రమేష్ ఆసుపత్రికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.

అన్ని సౌకర్యాలు ఉండి.. అనుమతులు వచ్చిన తర్వాతనే… స్టార్ రేటింగ్ ఉన్న హోటల్స్ ను క్వారంటైన్ సెంటర్లుగా మార్చారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెబుతోంది. క్వారంటైన్ సెంటర్లలో పేషంట్లకు ట్రీట్‌మెంట్ మాత్రమే ఆస్పత్రి బాధ్యతని.. మిగతా సౌకర్యాలు మొత్తం హోటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతని గుర్తు చేశారు. వైద్యులను అరెస్ట్ చేయడం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని గుర్తు చేశారు. కార్డియలజిస్ట్ అసోసియేషన్ కూడా ఇదే అంశంపై మరో లేఖను ముఖ్యమంత్రికి పంపింది. రమేష్‌బాబును అరెస్ట్ చేయాలనుకోవడం సరికాదని తెలిపింది. మరో వైపు… రమేష్‌బాబును రమేష్ చౌదరి అంటూ.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దగ్గర్నుంచి అందరూ.. విమర్శలు చేశారు. అయన చంద్రబాబుకు దగ్గర అని తేల్చేశారు.

మరో వైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు.. హోటల్‌కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని తేల్చారు. అయితే అనుమతులకు తగ్గట్లుగా ఏర్పాట్లు లేవని నివేదికలు సిద్ధం చేశారు. అనుమతులిచ్చేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారని, కనీసం క్వారంటైన్ సెంటర్ల నిర్వహణపై ఎటువంటి నిఘా ఉంచలేదని రిపోర్టులు సిద్ధం మచేసినట్లుగా చెబుతున్నారు. రమేష్ ఆస్పత్రి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు.. ఇక కరోనా రోగల్ని చేర్చుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close