చైతన్య : హిందూత్వంపై దాడితో లాభం ప్రభుత్వానికా..? ప్రతిపక్షానికా..?

ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇంత గొలుసుకట్టుగా జరుగుతున్నాయంటే… దానర్థం..హిందూత్వంపై దాడితోనే. ఇలా హిందూత్వంపై ఎవరికి లాభం కలుగుతుంది..? రామతీర్థం ఘటన రగడ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారు.. వైసీపీ రాజకీయ వ్యూహాలన్నింటికీ.. కర్త, కర్మ, క్రియగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. జనరంజక పాలన అందిస్తున్న జగన్… ఆలయాలను ధ్వంసం చేయించి.. తన కన్ను తానే పొడుచుకుంటారా.. అని అమాయకంగా ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వాళ్లు ఆలయాలను ధ్వంసం చేయించి.. ఎందుకు ప్రజల్లో అలజడి రేపుకుంటారు అని చాలా మంది అనుకోవచ్చు. కానీ రాజకీయం అంటే అదే మరి..!

అధికారంలో ఉండి చేసి చిచ్చులు పెట్టడమే కదా..!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి రాజధానిని నిర్ణయించేటప్పుడు అసెంబ్లీలో ఓ మాట అన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక.. అమరావతి రాజధానిగా అంగీకరిస్తున్నట్లుగా ప్రకటించారు. అదే సీఎం అయిన తర్వాత మూడు రాజధానులను ప్రకటించి.. ప్రజల మధ్య చిచ్చు పెట్టేశారు. మరి ప్రతిపక్ష నేతగా ఉన్న బాధ్యత.. సీఎంగా ఎందుకు లేదు..? . దీన్నే ఇప్పుడు ఆలయాలపై దాడులకూ అన్వయించవచ్చు. రాజకీయాలంటే.. విభజించు పాలించు అనే సిద్ధాంతం. పాలకుడు అంటే.. ప్రజలందరి బాగోగులు చూడాలన్నది పాత కాలం వాదన. నయా పాలకులు.. ప్రజల్ని విభజించి.., మెనార్టీలైన వారిపై.. మెజార్టీని ఎగదోసి.. ఓటు బ్యాంక్‌గా మార్చుకునే రాజకీయం చేస్తున్నారు. పాలన చేతుల్లో ఉండటంతో దాన్ని దూకుడుగా అమలు చేస్తున్నారు. దాని వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.

ఎప్పుడూ లేని దాడులు ఇప్పుడే ఎందుకు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా… విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడయినా ఆలయాలపై దాడులు జరగలేదు. ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. మరి ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి.. అని ఆలోచిస్తే.. ఒక్కటే కారణం. గత ప్రభుత్వాల హయాంలో మత మార్పిళ్లు అనేవి జరిగేవి కావు. కానీ ప్రభుత్వ హయాంలో ఉద్యమంలా ఉద్ధృతంగా జరుగుతున్నాయి. ఎవరు కన్వర్టడ్ క్రిస్టియనో.. ఎవరు హిందువో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడగానే ఈ దుష్పరిణామాలు కనిపించాయి. హోంమంత్రి సుచరిత అఫిడవిట్ ప్రకారం ఆమె హిందూ.. కానీ.. తాను క్రిస్టియన్‌ను అని చెప్పిన వీడియోలు బయటకు వచ్చాయి. తాడికొండ ఎమ్మెల్యే కన్వర్టడ్ వ్యవహారం రాష్ట్రపతి వరకూ వెళ్లింది. ప్రభుత్వంలో సీఎం దగ్గర్నుంచి ప్రభుత్వంలో కీలక పదవులు పొందుతున్న వారందరూ… రెడ్డి సామాజికవర్గం వారని అనుకుంటూ ఉంటారు. కానీ.. అందులోనూ.. కన్వర్టడ్ క్రిస్టియన్స్ ఎక్కువ అని చాలా కొద్ది మందికి తెలుసని కొంత మంది చెబుతూ ఉంటారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా… కన్వర్టర్ క్రిస్టియన్స్.. ఓ పార్టీకి సపోర్టర్లుగా మారిపోతున్నారు. ఆ పార్టీ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. అంటే.. పకడ్బందీగా .. ఆ పార్టీ కనుసన్నల్లో కన్వర్షన్లు జరుగుతున్నాయన్నమాట. అసలు కొండ దేవతల్ని పూజించుకునే గిరిజనులకు.. క్రైస్తవం అనే మాటే తెలియదు. కానీ ఇప్పుడు.. ఏ గిరిజన ప్రాంతానికి వెళ్లిన కన్వర్టెడ్ ప్రజలు కనిపిస్తున్నారు. ఓ పార్టీకి అలాంటి చోట్ల తిరుగులేని విజయాలు దక్కడం… ఆ కన్వెర్షన్ల మహిమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితి రాష్ట్రమంతా రావాలని ఎవరు మాత్రం కోరుకోరు. అధికారం అందిన తర్వాత ఊరుకుంటారా..?. ఇప్పుడు అదే జరుగుతోందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

హిందూత్వం బలహీనమని చెప్పే ప్రయత్నమే..!

మతమార్పిళ్లు ఎలా జరుగుతాయి… ఆ దేవుడు రక్షించడు.. మా దేవుడు రక్షిస్తాడు అని చెప్పడం ద్వారా .. నమ్మించడం ద్వారా జరుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ దేవుడు కూడా ఆలయాలను కాపాడలేపోతున్నాడు.. హిందువులు కూడా.. పట్టించుకోకుండా ఉన్నారని చెప్పడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నమ్మకాల్ని కల్పించడానిేనని … ఆలయాలపై దాడులనేది చాలా మంది వాదన. హిందూత్వం ఎంత బలహీనమోచెప్పడానికన్నట్లుగా చివరికి తిరుమల ఆలయంపై శిలువ గుర్తులు కూడా కనిపించడం ప్రారంభించాయి. దాన్ని కలశంగా చెప్పి.. నమ్మిస్తున్నారు. మంత్రులతో ఆలయం దగ్గరే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిస్తున్నారు.

తనపై కుట్ర జరిగితే తెలుసుకోలేనంత చేతకాని ప్రభుత్వమా..!?

ప్రభుత్వంపై కుట్ర జరిగిందా.. లేకపోతే ఆలయాలపై కుట్ర జరిగిందా.. లేక హిందూ విశ్వాసాలపై దాడి చేస్తున్నారా.. అన్నది తేల్చాల్సింది ప్రభుత్వమే. కుట్రలను చేధించి నిజాలను ప్రజల ముందు ఉంచాలి. దోషలను శిక్షించాలి. కానీ ప్రభుత్వమే అలా చేస్తోందన్న అభిప్రాయం వల్ల .. ఏ ఒక్కరూ దొరకడం లేదు. అల్లర్లు జరిగితే మాకే నష్టం అని ఎదురుదాడి చేస్తూ… ఓటు బ్యాంక్ రాజకీయాన్ని తెర వెనుకగా.. అధికార పార్టీ చేస్తోందన్న అనుమానాలున్నాయి. దీనికి కారణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్...

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

రేప్ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు..!

" ఇవన్నీ కాదు కానీ నేను నిన్ను పాడు చేశానని కేసు పెట్టు... నేను కూడా నిజమేనని ఒప్పుకుని జైలుకు వెళ్తా...!" అని ఓ సినిమాలో హిరోయిన్ సిమ్రాన్‌తో కమలహాసన్ అంటాడు....

HOT NEWS

[X] Close
[X] Close