షూటింగులు బంద్ చేస్తే ఎవ‌రికి న‌ష్టం?

చిత్ర‌సీమ‌లో నిర్మాత‌ల ఆలోచ‌న‌లు బంద్ దిశ‌గా సాగుతున్నాయి. ఆగ‌స్టు 1 నుంచి షూటింగులు నిలుపు ద‌ల చేయ‌డానికి కొంత‌మంది నిర్మాత‌లు రెడీ అయిపోయారు. అయితే.. బుధ‌వారం ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో మ‌రో కీల‌క‌మైన సమావేశం జ‌ర‌గ‌బోతోంది. ఈ మీటింగ్‌లో 5 అంశాలపై విపులంగా చ‌ర్చించ‌బోతున్నారు. టికెట్ ధ‌ర‌లు, ఓటీటీ, నిర్మాణ‌వ్య‌యం అదుపు, ప‌ర్సంటేజీ విధానం. వీపీఎఫ్ ఛార్జీలు… వీటిపై నిర్మాత‌లు లోతుగా విశ్లేషించి ఓ నిర్ణ‌యానికి వ‌స్తారు. ఏ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకొన్నా దాదాపుగా బంద్ ఖాయంగానే క‌నిపిస్తోంది. షూటింగులు ఆపేస్తే త‌ప్ప‌, త‌మ బాధ 24 విభాగాల‌కూ అర్థం కాద‌ని, స‌మ‌స్య తీవ్ర‌త తెలీద‌ని నిర్మాత‌లు న‌మ్ముతున్నారు.

అయితే షూటింగులు ఆపేయ‌డం వ‌ల్ల‌.. ముఖ్యంగా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఎందుకంటే.. ఓరోజు షూటింగ్ ఆగిందంటే ల‌క్ష‌ల్లో న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. హీరోల‌కు ఆల్రెడీ అడ్వాన్సులు ఇచ్చేసి ఉంటారు. లొకేష‌న్లు ముందే బుక్ అయి ఉంటాయి. సెట్స్ వేసుకుంటే.. అదో స‌మ‌స్య‌. సినిమా ఆల‌స్య‌మ‌య్యే కొద్దీ.. వ‌డ్డీల భారం పెరుగుతుంటుంది. పారితోషికం ముందే తీసేసుకొన్న హీరోల‌కు, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కూ.. ఏ బాధా ఉండ‌దు. షూటింగ్ ఎప్పుడంటే అప్పుడు వ‌స్తారు. లేదంటే ఇంట్లోనే ఉంటారు. అంతే క‌దా? మ‌ధ్య‌లో న‌లిగిపోయేది.. కార్మికులు మాత్ర‌మే. రోజువారీ వేత‌నం తీసుకొనే సినీ కార్మికులు ఈ బంద్ తో తీవ్రంగా న‌ష్ట‌పోతారు. అంటే.. పై స్థాయిలో నిర్మాత‌, కింది స్థాయిలో కార్మికుడు త‌ప్ప‌.. మిగిలిన వాళ్ల‌కు ఏ నొప్పీ తెలీదు. అలాంట‌ప్పుడు బంద్ నిర్వ‌హించ‌డం వ‌ల్ల లాభం ఏమిటి?

ఇదే లా పాయింట్ కొంత‌మంది నిర్మాత‌లు లాగుతున్నారు. అందుకే ఈ బంద్ విష‌యంపై నిర్మాత‌లు స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారు. ఇండ‌స్ట్రీకి ఇప్పుడు పెద్ద దిక్కంటూ లేక‌పోయింది. నిర్మాత‌ల్నీ, 24 విభాగాల ప్ర‌తినిధుల‌నూ కూర్చోబెట్టి, మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించి, స‌మ‌స్య‌ని సానుకూలంగా ప‌రిష్క‌రించే నాధుడు లేని లోటు ఇప్పుడు మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆదాయ మార్గాలు త‌గ్గిన‌ప్పుడు నిర్మాణ వ్యయం త‌గ్గించుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేదు. రోజువారి వేత‌నం కోసం ఆరాట ప‌డే సినీ కార్మికుల వేత‌నంపై క‌త్తెర వేసే బ‌దులు.. కోట్ల‌కు కోట్లు తీసుకొనే హీరోలు, ద‌ర్శ‌కుల పారితోషికాల‌కు అడ్డు క‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంది. మేం అగ్ర హీరోల జోలికిపోం… అని నిర్మాత‌లు గిరి గీసుకొని కూర్చుంటే మాత్రం ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌కదు. ఎన్ని రోజులు సినిమా షూటింగులు బంద్ చేసినా… ఫ‌లితం ద‌క్క‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close