ఎదురుగా ఉంటే విద్యుత్ బకాయిలు అడగరేంటి !?

తెలంగాణ విద్యుత్ బకాయిలు ఇవ్వాలని కేంద్రం నుంచి ఎవరు వచ్చినా ఫిర్యాదు చేసే ఏపీ ప్రభుత్వ పెద్దలు నేరుగా విభజన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాత్రం తన డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా తీసుకు రాలేదు. చాలా రోజుల తర్వాత విభజన సమస్యలపై కేంద్రం ముఖాముఖి భేటీ ఏర్పాటు చేసింది. ఇందులో రాజధాని కోసం నిధులు అడిగారు.. వెనుకబడిన జిల్లాలకు నిధులు అడిగారు కానీ… వాటికి యూసీలు సమర్పించలేదు.

అవి సమర్పిస్తే నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో తెలంగాణ తమకు రావాల్సిన నిధుల గురించి అడిగింది. అయితే అసలు కరెంట్ బకాయిల గురించి ఎవరూ మాట్లాడలేదు. నెల రోజుల్లో చెల్లించాలని కేంద్రం తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది. తెలంగాణ సర్కార్ చెల్లించలేదు. ఈ విషయంపై స్పష్టంగా అడగాల్సిన ఏపీ సర్కార్ ప్రతినిధులు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ ప్రభుత్వం తమకే ఏపీ సర్కార్ ఇవ్వాలని అంటోంది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేసింది.

అయితే హైకోర్టు డబ్బులు కట్టవద్దని ఏమీ చెప్పలేదు. కేవలం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.ఈ అంశంపై కేంద్రం గట్టిగా వ్యవహరించడానికి అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో వారు కూడా ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దీంతో ఈ విద్యుత్ బకాయిల అంశం ఇక కోర్టులో ఉండిపోవడమేనని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతీ యాభై ఇళ్లకు వైసీపీ తరపున ఇంకొకరు నిఘా !

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం పన్నులుగా కట్టిన సొమ్మును ఇస్తూ.. ప్రతి యాభై ఇళ్లకు ఓ వ్యక్తిని నియమించింది. వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఆ...

“వారాహి” రంగు మార్చక తప్పదా !?

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి హాట్ టాపిక్ అయింది. యుద్ధ ట్యాంక్‌ను పోలి ఉండటం.. సేనాని ఎన్నికల యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఉండటంతో ఈ వాహనం పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే...

ముద్ర పడింది – టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయిపోయింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. దసరా రోజున టీఆర్ఎస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తూ లేఖ పంపింది. కేసీఆర్ ఈ లేఖను...

షూటింగులు బంద్.. అట్టర్ ఫ్లాఫ్ షో

చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలని పరిష్కరించడానికి నిర్మాతలు అంతా కలసి షూటింగ్ బంద్ కి పిలుపునిచ్చారు. దాదాపు ముఫ్ఫై రోజులు షూటింగులు నిలిపివేశారు. తాజాగా నిర్మాత కళ్యాణ్ ఈ షూటింగ్ బంద్ ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close