టీటీడీలో ఇప్పుడేం జరిగిందని బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు..?

తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ నేతలు హఠాత్తుగా.. రాజ్‌భవన్ లో ప్రత్యక్షమయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. ఉన్న పళంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ వినతి పత్రం ఇచ్చారు. నిజానికి .. అమిత్ షాను రమణదీక్షితులు కలిసిన తర్వాత రగిలిన రగడ.. తర్వాత సద్దుమణిగిపోయింది. కొన్నాళ్లుగా ప్రశాంతంగా… ఉంది. అయినా భారతీయ జనతా పార్టీ నేతలు ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లుగా.. గవర్నర్ కు ఎందుకు ఫిర్యాదు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ కు ఏం చెప్పారో కానీ.. బయటకు వచ్చి మాత్రం.. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతున్నారని.. దీనిపై టీటీడీ చర్యలు తీసుకోవడం లేదని అందుకే గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు.టీటీడీలో రోజు రోజుకు అవినీతి పెరిగిపోతోందని చెప్పుకొచ్చారు. విజిలెన్స్,ఈడీని విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరామంటున్నారు.

నిజానికి తిరుమలలో టిక్కెట్ల దందా ఇటీవలి కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా ఆన్ లైన్ చేయడంతో.. వీఐపీ సిఫార్సు లేఖల ద్వారా కూడా టిక్కెట్లు పొందం.. కనాకష్టంగా మారింది. గతంతో పోలిస్తే.. చాలా వరకు.. టిక్కెట్లు అక్రమాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ. బీజేపీ నేతలు.. దీన్నే ఎందుకు కారణంగా చేసుకుని.. గవర్నర్ కు ఎందుకు ఫిర్యాదు చేశారో.. ఇతర పార్టీల నేతలుక అర్థం కావడం లేదు. బేసిగ్గా బీజేపీ రాజకీయం.. దేవుళ్ల మీదే ఉంటుంది. దానికి శబరిమల ఇష్యూనే ఉదాహరణ. హిందూత్వం పేరుతో.. దేవుడ్నే… రోడ్డుకు ఈడ్చి.. కేరళలో కర్ఫ్యూ విధించేంత పరిస్థితులు తెచ్చారు. గతంలో రమణదీక్షితులతోనూ.. బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేయించి.. రచ్చ రచ్చ చేసింది. .. ఆ ఇష్యూని ప్రజల సెంటిమంట్ గా మార్చే ప్రయత్నం చేసి విపలమయింది.

ఆ తరహాలోనే.. ఇప్పుడు తిరుమల వేదికగా… బీజేపీ కొత్త వ్యూహం ఏమైనా పన్నుతుందేమోనన్న అనుమానాలు తాజాగా… బీజేపీ నేతల రాజ్ భవన్ పర్యటనతో వస్తున్నాయని.. టీడీపీ నేతలు అంటున్నారు. అసలు ఏమీ జరగకుండా… బ్లాక్ టిక్కెట్ల ఇష్యూతోనే గవర్నర్ కు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముందన్నది టీడీపీ నేతల అనుమానం. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల రాజ్ భవన్ టూర్ వెనుక అసలు కథేమిటో వాళ్లు చెబితేనే బయటకు తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close