చైతన్య : రణవీర్ చేస్తే చూడలేరు.. హీరోయన్లు చేస్తే చూస్తారా !?

రణవీర్ సింగ్ న్యూడ్‌గా ఫోటో షూట్ చేశారని గగ్గోలు రేగుతోంది. కొంత మంది అపర మేధావులు.. పని లేని వాళ్లు ఆయన న్యూడ్ ఫోటో షూట్ చేశారని.. ఇలా ఎలా చేస్తారని రెచ్చిపోతున్నారు. మరికొంత మంది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ వ్యవహారం అంతా విచిత్రంగా సాగుతోంది. రణవీర్ న్యూడ్ ఫోటో షూట్ చేశారు కానీ అందులో ఆయన ప్రైవేటు పార్టులేమీ కనిపించకుడా జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా భాగమంతా సినిమాల్లో అండర్ వేర్‌తో ఎన్నో సార్లు కనిపించిన రూపమే. అయనా సరే ఇప్పుడు కొంత మంది దీన్ని ఎథిక్స్‌కు సంబంధించిన మేటర్‌గా ప్రచారంలోకి తెచ్చేస్తున్నారు.

రణవీర్ ఫోటో షూట్‌ మగవారి పరువు తీసిందా !?

రణవీర్ ఫోటో షూట్ విషయంలో చాలా మంది విచిత్రంగా స్పందిస్తున్నారు. మగవాడై ఉండి అలా ఫోటో షూట్ చేయడమేమిటని.. మన సంస్కృతి , సంప్రదాయాలు ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలు చాలామందికి విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఇందులో అంత అసహ్యం ఏముందన్నది వారి డౌట్. సంస్కృతి, సంప్రదాయల ముసుగులో ప్రతీది వివాదం చేసే కొంత మంది తప్ప.. రణవీర్ ఫోటో షూట్‌లో ఎవరూ వివాదం చూడటం లేదు. ఒకప్పుడు సూపర్ మోడల్స్‌గా ఉన్న మధుసప్రే, మిలింద్ సోమన్ ఓ షూ కంపెనీ కోసం పూర్తి న్యూడ్‌గా చేసిన ఫోటో షూట్ సంచలనం సృష్టించింది. అది మూడు దశాబ్దాల క్రితమే. ఇన్నేళ్ల తర్వాత ఓ మగవ్యక్తి ఒక్కరే అలాంటి ఫోటో షూట్ చేస్తే ఎందుకు రచ్చ చేస్తున్నారో ?

హీరోయిన్లు అంతకు మించి చేస్తున్నా గుటకలు మింగుతూ చూస్తున్నారే !

రణవీర్ సింగ్ చేసిన ఫోటో షూట్ వ్యవహారం కలకలం రేపవచ్చు కానీ.. హీరోయిన్లు చేస్తున్న ఫోటో షూట్ల గురించిమాత్రం ఎవరూ స్పందించడం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ ఫోర్ట్ ఫోలియోలో టూపీస్ బికినీ ఫోటోలు కామన్. ఎంతగా అంటే బాడీ ఒంపుసొంపులన్నీ చూపించాల్సిందే. ప్రైవేటు పార్టులు మాత్రమే మూసేసుకుని ఫోటోలు దిగడం కామన్. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కత్రీనా కైఫ్ లాంటి మోడలింగ్ నుంచి సినిమాలకు వచ్చిన హీరోయిన్లు అలా ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే అది తప్పని వారు అనుకోవడం లేదు. చూసేవాళ్లూ అనుకోవడం లేదు. గుడ్లు మిటకరించి చూస్తున్నారు. కానీ తప్పని అనడం లేదు.

ఆలోచనల్లో వస్తున్న మార్పు !

నగ్నత్వం ఎప్పుడూ చెడు కాదు. నగ్నత్వం స్వచ్చం. అందుకే విదేశాల్లో న్యూడ్ అనేదానికి విపరీతమైన గౌరవం ఉంది. కానీ మన దగ్గర బాడీని చూపించుకోవడం అంటే.. అదో షేమ్‌లా ఫీలవుతూంటారు. కానీ చూసేవాళ్లవి మాత్రం చాటుగానే చూస్తూ ఉంటారు. కారణం ఏదైనా రణవీర్ ఫోటో షూట్‌పై చర్చకు వస్తున్న ప్రతికూల స్పందనలకు కౌంటర్లు వస్తున్న మార్పులకు సంకేతాలు. ఫోటోలు చూసి ఎంజాయ్ చేయనివ్వండి అని విద్యాబాలన్ నేరుగానే చెప్పారు.. ఇష్టం లేకపోతే చూడమాకండి అని సలహా ఇచ్చారు. ఆమె మాటల్లో చాలా వాస్తవం ఉంది. అందులో సందేహం లేదు. ఇక రణవీర్ భార్య దీపికా కూడా అంతే. గతంలో ఆమె క్లీవేజ్ చూపిస్తున్నారంటూ టాప్ యాంగిల్‌లో ఫోటో తిసి ప్రచారం చేసిన పత్రికకు గట్టికౌంటర్ ఇచ్చారు. తనకు అద్భుతమైన బాడీ ఉంది చూపించుకుంటానని చాలెంజ్ చేశారు.

చూసే చూపుల్లోనే అంతా ఉంది !

ఏదైనా చూసే చూపుల్లోనే అంతా ఉంటుంది. రణవీర్ సింగ్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూసుకోవచ్చు. అది సంప్రదాయంగానా..లేకపోతే బరి తెగించిన వ్యక్తిగానా అన్నది చూసే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని..మనస్థత్వాన్ని బట్టి ఉంటుంది. అలాంటివి రణవీర్ సింగ్ లాంటి వాళ్లకు డోంట్ కేర్. అదే అసలైన వ్యక్తిత్వం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న `రెబ‌ల్‌` భ‌యం

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. సెప్టెంబ‌రు 28, 2023న ఈ సినిమాని రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. దాంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలైపోయారు. ఎందుకంటే ఇలాంటి అప్ డేట్ కోస‌మే వాళ్లు...

కులాల లెక్కలేసుకుంటే జనసేనకు 40 సీట్లొచ్చేవి : పవన్

కుల , మతాలు లేని రాజకీయం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ఈ సందర్భంగా కుల, మతాల...

‘స‌లార్’ అప్‌డేట్‌: రిలీజ్ డేట్ ఫిక్స్‌

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో.. ఎదురుచూస్తున్న అప్ డేట్ వ‌చ్చేసింది. 'స‌లార్‌' రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ...

బింబిసార విజయ రహస్యం ఇదేనా?

కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గిపోయిందనే మాట సర్వాత్ర వినిపిస్తోంది. దీనికి కారణం ఓటీటీ ప్రభావమని కొందరంటే.. సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచి మళ్ళీ తగ్గించి ప్రేక్షకుడికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close