‘సైమా’కి సాధ్య‌మైంది… ‘మా’కి కాదా..??

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కి ఓ సొంత భ‌వ‌న‌మంటూ లేదు. ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ‘మా’కి ఒక్క రూమ్ ఉందంతే! పేరున్న స్టార్లు, కోట్ల పారితోషికాలు తీసుకుంటున్న క‌థానాయికలు స‌భ్యులుగా ఉన్న ‘మా’కి సొంత భ‌వ‌న‌మంటూ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. ”మా హ‌యంలో సొంత భ‌వ‌నం తెస్తాం” అని వాగ్దానాలు చేసి ‘మా’ పీఠాలెక్కారెంద‌రో. కానీ ఎవ్వ‌రి వ‌ల్లా సాధ్యం కాలేదు. శివాజీ రాజా కూడా అదే మాట అన్నాడు. కానీ… అది ఆచ‌ర‌ణ సాధ్యం కావ‌డం లేదు. ‘మా’కి ఫండ్లు తీసుకొచ్చే ప‌నిలో… ఇటీవ‌లే అమెరికాలో ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. చిరంజీవి లాంటివాళ్లు ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నా… దీని వ‌ల్ల ‘మా’కి వ‌చ్చిన నిధి కేవ‌లం కోటి రూపాయ‌లు మాత్ర‌మే. ఈ విష‌య‌మై ఇటీవ‌ల శివాజీ రాజా – న‌రేష్‌ల మ‌ధ్య వివాదం కూడా న‌డిచింది. ఆ త‌ర‌వాత ‘మేమంతా ఒక్క‌టే’ అని అన్నార‌నుకోండి.. అది వేరే విష‌యం. చిరంజీవి లాంటి వాళ్లు వెళ్లినా.. కోటి రూపాయ‌లు కూడా రాలేదేంటి? అని మీడియా ప్ర‌శ్నించింది. దానికి ‘మా’ నుంచి స‌రైన స‌మాధానం రాలేదు.

అయితే ఈమ‌ధ్య దుబాయ్‌లో ‘సైమా’ అవార్డు వేడుక‌లు జ‌రిగాయి. వీటి వ‌ల్ల ‘సైమా’ నిర్వాహ‌కుల‌కు అధ‌మ ప‌క్షంలో రూ.5 కోట్ల వ‌ర‌కూ మిగిలాయ‌ని ఓ టాక్ వినిపిస్తోంది. సినిమాల‌కు ఏమాత్రం సంబంధం లేని ఓ ప్రైవేటు వ్య‌క్తి నిర్వ‌హించిన ఓ అవార్డు కార్యక్ర‌మానికి ఈ స్థాయిలో నిధులు వ‌చ్చాయంటే… ‘మా’ పూనుకుంటే ఇంత కంటే… గొప్ప‌గా సాధిస్తుంది క‌దా? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఇప్పుడున్న స్టార్లంతా ‘మా’ స‌భ్యులే. వాళ్లంతా ఓ తాటిపై ఉంటే.. ‘సైమా’లాంటి కార్య‌క్ర‌మం ఏడాదికి ఒక్క‌టి నిర్వ‌హించినా… ఈపాటికి ‘మా’కంటూ సొంత భ‌వ‌నం, స్థిర‌మైన నిధి ఏర్ప‌డిపోయేవి. కానీ ఆ దిశ‌గా ఎవ్వ‌రూ ఆలోచించ‌డం లేదు. క‌నీసం న‌లుగురైదుగురు స్టార్లు ముందుకొచ్చి.. హైద‌రాబాద్లోనే ఓ ఈవెంట్ నిర్వ‌హించుకుంటే… స్పాన్స‌ర్ షిప్‌ల రూపంలో భారీగా సొమ్ములు రాబ‌ట్టొచ్చు. నిజంగా ‘మా’కి సొంత భ‌వ‌నం కావాల‌న్న చిత్త‌శుద్దే ఉంటే… ఈ పాటికి ఈ ప‌ని ఎప్పుడో చేసి ఉండేవారేమో. ‘మా’లో దాదాపు 800 వ‌ర‌కూ స‌భ్యులున్నారు. వాళ్ల‌లో ‘మా’ వ్య‌వ‌హారాల గురించి లోతుగా ఆలోచించేది, ప‌రిశీలించేది ప‌ది మందికి మించ‌రేమో. ‘మా’ అవ‌స‌రాలు చాలా ఉన్నాయి. పించ‌న్లు, ఆరోగ్య భీమా లాంటివి ‘మా’ చూసుకుంటోంది. వీటికి నిధులు కావాల‌న్నా.. మొహ‌మొహాలు చూసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఇవ‌న్నీ రాకుండా ఉండాలంటే… ‘సైమా’ని స్ఫూర్తిగా తీసుకుని ‘మా` కూడా ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలి. లేదంటే ‘మా’ కి సొంత భ‌వ‌నం ఎప్పటికీ ఓ క‌ల‌లానే మిగిలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close