ఇప్పుడు సమస్య చంద్రబాబు వేలికి ఉన్న ఉంగరమేనా ?

చంద్రబాబు చేతికి ఓ ఉంగరం కనిపించింది. అంతే.. కొన్ని రకాల మీడియాకు పండగైపోయింది. ఆ ఉంగరం ఎందుకు పెట్టుకున్నారు ? అనే దగ్గర నుంచి ప్రారంభించి.. ఎన్నికల వరకూ తీసుకెళ్లి చివరికి మహారాజుల జాతకాలకు లింక్ పెట్టేశారు. అబ్బా ఈ రింగ్‌లో అంత కథ ఉంటుందా అని .. మొత్తం విడమర్చి చెప్పేవాళ్లను ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు. చంద్రబాబు ఏ వేలికి ఉంగరం పెట్టుకున్నారు.. ఎందుకు పెట్టుకున్నారు… అలా ఎందుకు పెట్టుకున్నారంటూ కథలుకథలుగా చెబుతున్నారు. త్వరలో వేణు స్వామి లాంటి వాళ్లతో డిబేట్లు కూడా ఆర్గనైజ్ చేసేలా ఉన్నారు.

అయితే చంద్రబాబు వాచీలు, ఉంగరాలు లాంటి వాటిని పెట్టుకోరు. మరి ఇప్పుడెందుకు పెట్టుకున్నారని ఎక్కువ మందికి డౌట్ వస్తోంది. అయితే ఆ ఫోటోలను కాస్త పరిశీలనగా చూసిన వారికి.. ఆయన ఉంగరంగాపెట్టుకున్న రింగ్‌ అనబడే వస్తువును పరిశీలన చూసిన వారికి కాస్త డౌట్ రావడం సహజం. ఎందుకంటే అది బంగారం కాదు.. ప్లాటినం కాదు. మరేంటి ?., చాలా మందికి తెలియదు కానీ.. ఇప్పుడు వేళ్లకు పెట్టుకునే ఫిట్ నెస్ బ్యాండ్స్ వచ్చాయి.

అలాంటి ఫిట్‌నెస్ బ్యాండ్‌ను చంద్రబాబు తన వేలికి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఆరోగ్య పరంగా ఎంతబిజీగా ఉన్నా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంత వ్యాయమం చేశారు..ఎంత కెలోరీలు ఖర్చయ్యాయి దగ్గర్నుంచి ఆ బ్యాండ్ లాంటి రింగ్ పెట్టుకుంటే చాలా వరకూ శరీరంలో జరిగిన మార్పుల గురించి స్పష్టత వస్తుందంటున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది జాతకాల .. నమ్మకాలు…అంటూ ఎక్కడికో వెళ్లిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close