ల‌తా మంగేష్క‌ర్ పేరుని గిన్నిస్ బుక్ ఎందుకు తొల‌గించింది?

ల‌తా మంగేష్క‌ర్‌… నిన్న‌టి వ‌ర‌కూ పాట‌ల పూదోట‌. ఇప్పుడొక జ్ఞాప‌కం. ల‌తాజీ సాధించిన విజ‌యాలు అపూర్వం.. అనిత‌ర సాధ్యం. ఆమె దాదాపు 50 వేల పాట‌లు పాడార‌న్న‌ది ఓ అంచ‌నా. ఇన్ని పాట‌లు పాడిన గాయ‌నీమ‌ణి మ‌రొక‌రు లేరు. 1974లోనే గిన్నిస్ బుక్ ఆమె ప్ర‌తిభ గుర్తించింది. అప్ప‌టికి ల‌త 25 వేల పాట‌లు పూర్తి చేశారు. అందుకే అత్య‌ధిక పాట‌లు పాడిన గాయ‌నిగా ఆమె పేరు గిన్నిస్ బుక్ లో లిఖించారు. అయితే ఆ త‌ర‌వాత‌.. కొన్నేళ్ల‌కు ల‌తాజీ పేరుని గిన్నిస్ బుక్ తొల‌గించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. 1974లో ల‌తా మంగేష్క‌ర్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కాక‌.. మ‌రో లెజెండ‌రీ గాయ‌కుడు మ‌మ‌హ్మ‌ద్ ర‌ఫీ.. దానిని క్లైమ్ చేశారు. ల‌తా కంటే నేనే ఎక్కువ పాట‌లు పాడాను అని ఆధారాలు చూపించారు. దాంతో.. గిన్నిస్ బుక్ ఆలోచ‌న‌లో ప‌డింది. 1975లో వ‌చ్చిన ఎడిష‌న్ లో ల‌త పేరుతో పాటు ర‌ఫీ పేరు కూడా చేర్చింది. ఆ త‌ర‌వాత ఆధారాలు సేక‌రిస్తే అప్ప‌టికి ల‌త పాడిన పాట‌లు 5 వేలే అని తేలింది. ల‌తాజీ అంత‌కంటే ఎక్కువ పాట‌లు పాడినా, వాటి వివ‌రాలు ఎక్క‌డా రాసుకోలేదు. అందుకే.. చాలా పాట‌లు క‌నుమ‌రుగైపోయాయి. అలా పాతిక వేల పాట‌లు పాడినా… కేవ‌లం 5 వేలే దొరికాయి. అందుకే.. 1991లో ల‌త పేరుని గిన్నిస్ బుక్ తొల‌గించింది. ఇప్ప‌టికైతే గిన్నిస్ బుక్‌లో అత్య‌ధిక పాట‌లు పాడిన గాయ‌కుడుగా ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, గాయ‌నిగా సుశీల పేర్లు లిఖించ‌బడ్డాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close