సీక్వెల్‌పై అంత తొంద‌రెందుకు..??

ఓ సినిమా హిట్ట‌యితే చాలు… సీక్వెల్ ఆరా మొద‌లైపోతుంది. ఈ క‌థ‌ని కొన‌సాగించే అవ‌కాశం ఉందా? అనేది చాలా రొటీన్‌గా వినిపించే ప్ర‌శ్న‌. దానికి ద‌ర్శ‌కుడు కూడా అంతే ఇదిగా స‌మాధానం చెప్పేస్తుంటాడు. ”అవును.. మేం కొన‌సాగిస్తాం.. ఆ అవ‌కాశం ఉంది” అని. ‘రంగ‌స్థ‌లం’ విజ‌యం త‌ర‌వాత కూడా ఇదే ప్ర‌శ్న ఉద్భ‌వించింది. దానికి సుకుమార్ కూడా రొటీన్‌గానే స‌మాధానం చెప్పేశాడు. ”మేం సీక్వెల్ తీస్తాం” అనేది ప్ర‌చారం లో ఓ భాగం మాత్ర‌మే. సినిమాకి హైప్‌పెంచుకోవ‌డానికి అదో మార్గం. కాక‌పోతే ‘రంగ‌స్థ‌లం’ లాంటి సినిమాకి కొత్త‌గా హైప్ పెంచుకునే ప‌నులేం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికి వ‌చ్చిన బ‌జ్ చాలు.

దానికి తోడు ‘రంగ‌స్థ‌లం’ సీక్వెల్‌కి అర్హమైన క‌థ కాదు. క‌థ చివ‌రి వ‌ర‌కూ డ్రైవ్ అయిపోయింది. క‌థ కి ఎక్క‌డ ముగింపు ప‌డాలో అక్క‌డ ప‌డిపోయింది. క‌థ‌లో కీల‌క‌మైన ప్రెసిడెంటు పాత్ర కీ తెర ప‌డింది. చిట్టిబాబు – రామ‌ల‌క్ష్మి క‌లసిపోయారు. ఆ ఊరి స‌మ‌స్య‌లు తీరిపోయాయి. ఇక ఈ క‌థ ఎక్క‌డి నుంచి మొద‌ల‌వుతుంది? బ‌హుశా.. రంగ‌స్థ‌లంకి సీక్వెల్ అనే ఆలోచ‌న కూడా సుకుమార్ మ‌దిలో లేదేమో! జ‌స్ట్‌.. ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఆ మాట చెప్పి ఉంటాడు. ఒక‌వేళ బ‌ల‌వంతంగా సీక్వెల్ తీయాల‌నుకుంటే ఏం జ‌రుగుతుందో.. అనుభ‌వ పూర్వ‌కంగా తెలుసుకున్నవాడు సుక్కు. ‘ఆర్య 2’ రిజ‌ల్ట్ గుర్తు పెట్టుకుని మ‌సులుకుంటే ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వ‌డేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close