ప్రత్యూష విషయంలో చూపిన ఔదార్యం ఇక్కడేమయింది?

రాక్షసిలాంటి పిన్ని చేతిలో చిత్రహింసలు అనుభవించి నరకాన్ని చూసిన ప్రత్యూష విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించిన తీరును ప్రజలంతా పొగుడుతున్నారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. చదువు చెప్పించడానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి చేస్తానని మాటిచ్చారు. మానవత్వం పరిమళించిన సందర్భమని మీడియా కూడా వేనోళ్ల పొగిడింది.

ప్రత్యూష విషయంలో ఇంత ఔదార్యం ప్రదర్శించిన కేసీఆర్, పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగిస్తున్నారనేది మాత్రం అంతుచిక్కని విషయం. జీతాలు పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మొన్నటి వరకూ సమ్మె చేశారు. పారిశుధ్య పనులు నిలిపివేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివిధ రంగాల కార్మికుల, ఉద్యోగుల సమ్మెలకు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. వారి తరఫున పోరాడానికి కూడా సిద్ధపడ్డారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులు సమ్మెచేసి బస్సులను ఆపేసినా, వారు అడిగిందానికంటే ఎక్కువే ప్రకటించారు.

మున్సిపల్ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలని కేసీఆర్ ప్రభుత్వం హుకుం జారీ చేసినా చాలా మంది విరమించలేదు. ఇది కేసీఆర్ కు కోపం తెప్పించింది. తాను ప్రకటించే నాటికి సమ్మె విరమించిన వారికి భారీగా వేతనాలు పెంచారు. విరమించని పారిశుధ్య కార్మికులను విధుల్లోంచి తొలగించాలని ఆదేశించారు. వీధుల్లో పారిశుధ్య కార్మికులపై వేటు వేయడమంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయడం వంటిదే. నామమాత్రపు వేదనాలతో రోడ్లను శుభ్రం చేసే వారిలో ఎక్కువ మంది మహిళలే. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల వారే అధికం.

ఉన్న పని ఊడిపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో ఓ మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. వేల మంది పారిశుధ్య కార్మికులు ఉపాధిలేక రోడ్డుమీద పడటం భావ్యమా? ప్రత్యూష విషయంలో ఎంతో ఔదార్యం చూపిన వ్యక్తి, కొన్ని వేల మంది బడుగు బలహీన వర్గాల పేద మహిళల పట్ల ఇంత కఠినంగా ఎలా ఉండగలరు? ఇదే అర్థం కాని విషయం. తాను చెప్పినప్పుడు సమ్మె విరమించలేదనే కోపం అయి ఉంటుంది. జీతాలు పెంచాలని డిమాండ్ చేసే కార్మికులు పట్టుదలగా సమ్మె చేయడం మహా పాపమేమీ కాదు. వారి ఆవేదనను అర్థం చేసుకోకుండా, నేను చెప్పిందే వేదం అనే తరహాలో వేల మందికి ఉపాధి లేకుండా చేయడమే ఆశ్చర్యకరం. ఇప్పటికైనా కేసీఆర్ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాని పేద పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close