హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌కు కేటీఆర్ అతిథి మర్యాదలు బాగా చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం అఖిలేష్ ను.. మాదాపూర్ లోని రామేశ్వరం కేఫ్ కు తీసుకెళ్లారు. ఇక్కడ వారు ఇడ్లీ, దోసెల వంచి దక్షిణాది వంటకాలను మధ్యాహ్నా భోజనంగా స్వీకరించారు. ఈ వీడియోలను బీఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా సర్క్యూలేట్ చేస్తున్నారు. అయితే కొంత మందికి వస్తున్న డౌట్.. రామేశ్వరం కేఫ్ ఎందుకు తెలంగాణ స్పెషల్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లవచ్చు కదా అని.
సమాజ్ వాదీ పార్టీ అధినేత పూర్తిగా తన వ్యక్తిగత పర్యటనకు వచ్చారు. ఓ రోజు యాదవసంఘాల భేటీకి..మరో రోజు తన పార్టీ తరపున వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న విజన్ ఇండియా సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చారు. శుక్రవారం నంది నగర్‌లోని తన ఇంట్లో అఖిలేష్ కు అతిథి మర్యాదలు చేశారు. శనివారం తాజ్ కృష్ణాలో తన పార్టీ సమ్మిట్ లో అఖిలేష్ మాట్లాడిన తర్వాత లంచ్ ను అక్కడే పూర్తి చేయాలనుకోలేదు. రామేశ్వరం కేఫ్ కు వెళ్లాలనుకున్నారు. కేటీఆర్ కూడా ఆయనతో జత కలిశారు.
కేటీఆర్ తన స్నేహితుడు.. తెలంగాణ స్పెషల్ గా ప్రసద్ధి చెందిన పాలమూరు గ్రిల్ లేదా తంగేడు రెస్టారెంట్లలో ఒక దానికి తీసుకెళ్తే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఐటి కారిడార్ లో ఉన్న తంగేడు రెస్టారెంట్ అయితే.. అఖిలేష్ యాదవ్ రేంజ్ కు సరిగ్గా సరిపోయేది. అయితే బెంగళూరులో చదువుకున్న అఖిలేష్.. దక్షిణాది వంటకాలను ఇష్టపడతారు. ఆయన రామేశ్వరం కేఫ్ ను మాత్రమే చాయిస్ గా ఉంచుకోవడంతో..కేటీఆర్ కూడా ఆయనతో వెళ్లక తప్పింది కాదంటున్నారు. బెంగళూరు కు చెందిన వ్యాపార సంస్థ రామేశ్వరం కేఫ్ బ్రాండ్ ను విస్తరిస్తోంది.
