వలస నేతలతో కొత్త రాజకీయం..! ఇదేనా జనసేన సిద్ధాంతం..!!

“వయసుడిగిపోయిన వేశ్య…” అనే ముతక పదం ఒకటి ఉంటుంది. దానిలో అర్థం చేసుకుంటే బూతు ఉంటుంది. కానీ అంతకు మించిన సత్యం కూడా బోధఫడుతుంది. ఫుల్ జోష్ లో ఉన్నప్పుడు.. అందర్నీ అలరించి… గొప్ప గొప్ప విజయాలు సాధించి.. చివరికి… రిటైరయ్యే సమయంలో.. కొత్తగా.. ఓ అవకాశాన్ని పొంది… పాత వైభవాన్ని చూద్దామనుకునేవాళ్లను వయసుడిగిపోయిన వేశ్యలంటారు. రాజకీయాల్లో ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. వాళ్లను పేర్లతో సహా మునం చప్పుకోలేం కానీ… మనం చెప్పుకునే విషయానికి.. ఈ పదానికి కొన్ని లింకులు ఉంటాయి… అందుకే ఈ ఉదాహరణ.

జనసేన నేతలకు పవన్ ఏ ప్రమాణాలు నిర్దేశించారు..?

నాకు యువ రక్తం కావాలి. చీల్చుకొచ్చేబుల్లెట్లకు ఎదురెళ్లే యువత కావాలి. వాళ్లే నా సైన్యం. జనసైనికులు..నేతలు వాళ్లే. వారసులు.. పార్టీలు మారే వారు నాకొద్దు. జనసేన అధినేత ఇప్పటికీ అప్పుడప్పుడూ చెబుతూ ఉంటారు. మొదట్లో అయితే.. రోజూ చెప్పేవారు. దానికి తగ్గట్లుగా కొంత కార్యాచరణ కూడా చేశారు. జిల్లాల వారీగా ఎంపిక శిబిరాలు నిర్వహించారు. టెస్టులు పెట్టారు. వాళ్ల నుంచే అధికార ప్రతినిధులు వస్తారన్నారు. వాళ్ల నుంచే.. స్పీకర్లు వస్తారన్నారు. వాళ్ల నుంచే భవిష్యత్ జనసేన నేతలు వస్తారన్నారు. పవన్ తీరు చూసి.. చాలా మంది.. అప్పట్లో ఎన్టీఆర్ కొత్త తరం నేతల్ని.. బడుగు, బలహీన వర్గాల బలమైన నేతల్ని… రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లు తీసుకొస్తారేమో అనుకున్నారు. పవన్ ఆలోచనలు చాలా గొప్పవన్నారు.

జనసేన పార్టీలో ఇప్పుడున్న నేతలెవరు..?

జనసేన పార్టీలో మొట్టమొదటగా టిక్కెట్ ఖరారు చేసింది.. ముమ్మడి వరం నియోజకర్గానికి చెందిన పితాని బాలకృష్ణ అనే నేతకు. ఈయన ఎవరు..? బుల్లెట్లకు ఎదురెళ్లే యువకుడా..? సామాజికసేవలో తపించిన వ్యక్తా..? పవన్ మొదటి నుంచి చెబుతున్న నైతిక విలువలతో కూడిన రాజకీయ లక్షణాలు ఉన్న నేతనా…? ఈ పితాని బాలకృష్ణలో.. ఒక్కటంటే.. ఒక్కటి కూడా ఆ లక్షణం లేదు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడని.. ఆరోపించి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి… నేరుగా జనసేనలో చేరిపోయారు. అదే మహాద్భాగ్యం అనుకుని పవన్ కల్యాణ్.. ఆయనకు కండువా వేసేసి సీటు ఖరారు చేశారు. పవన్ తాను చెప్పిన ఆదర్శాలను తొలి సీటు ప్రకటనలోనే… ఎంతో లోతుకు తీసుకెళ్లిపోయారన్నమాట.

లీడర్ – పాత పార్టీ

మాదాసు గంగాధరం – కాంగ్రెస్
చదలవాడ కృష్ణ మూర్తి – టీడీపీ
తోట చంద్రశేఖర్ – వైసీపీ
నాదెండ్ల మనోహర్ – కాంగ్రెస్
పి.బాలరాజు – కాంగ్రెస్
కందుల దుర్గేష్ – వైసీపీ
రాజా అశోక్ బాబు – వైసీపీ
ముత్తా గోపాల కృష్ణ – వైసీపీ
పితాని బాలకృష్ణ – వైసీపీ
రాపాక వరప్రసాద్ – వైసీపీ
పాముల రాజేశ్వరీ దేవి – వైసీపీ
అద్దేపల్లి శ్రీధర్ – బీజేపీ
రావెల కిషోర్ – టీడీపీ

త్వరలో మరింత మంది ..!

జనసేన జీన్స్ తో ఉన్న లీడర్లెవరైనా ఉన్నారేమో చూద్దాం…! చిత్తూరు నుంచి సిక్కోలు వరకూ.. జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి.. దుర్భిణి పెట్టి వెదికినా.. ఒక్కరంటే.. ఒక్కరూ .. జనసేన నేత కనిపించడం లేదు…

జనసేనలో చేరిన ఒక్కరికైనా పవన్ చెప్పే లక్షణాలున్నాయా..?

మాదాసు గంగాధరం… ఈయన ఇప్పటి నేత కాదు. కానీ పవన్ దగ్గర చేరారు. అప్పట్లోనే.. అంటే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్మడంలో మధ్యవర్తిగా వ్యవహరించారన్న పేరున్న నేత. అప్పట్లో ఆయనకు కార్యకర్తలు దేహశుద్ది చేశారన్న పేపర్ క్లిప్పింగులు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఇక తోట చంద్రశేఖర్. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన .. కార్గిల్ సైనికుల కోసం నిర్మించిన ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో ఇరుక్కున్న సివిల్ సర్వీస్ అధికారి. వీఆర్ఎస్ తీసుకుని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అందులోనూ ఆయనపై అన్నీ అభియోగాలే. ముత్తా గోపాలకృష్ణ.. ప్రతి ఎన్నిక సమయంలోనూ.. ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే.. ఆ పార్టీలో కనిపించే నేత. నాదెండ్ల మనోహర్. కాంగ్రెస్ కండువా తన శరీరంలో భాగం అని ఆ పార్టీ తరపున రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి చెప్పిన వ్యక్తి. ఇప్పుడా కండువా లేకుండానే … విలువలు వదిలేసినట్లు వదిలేసి జనసేనలో నెంబర్ టూలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రావెల కిషోర్. ఆయన కుమారుడు ఇక జనసేన జెండాతో చేసే హడావుడి ఎలా ఉంటుందో చెప్పలేం. ఎన్ని కేసులవుతాయో అంచనా వేయలేం. వీరే కాదు… గోదావరి జిల్లాల్లో ఎంతో మంది నియోజకవర్గ స్థాయి నేతలు పార్టీలో చేరారు.

ఒక్కరైనా… ఈ నేత జనసేన నుంచి ఎదిగారని చెప్పుకోగలవా…?

టీఆర్ఎస్ అంటే ఉద్యమపార్టీ… అందులో ఇప్పుడు చూస్తే… మహేందర్ రెడ్డి, తలసాని, దానం, తుమ్మల లాంటి వాళ్లే కనిపిస్తారు. అదే జనసేన అంటే… నాదెండ్ల, తోట చంద్రశేఖర్, ముత్తా గోపాలకృష్ణ, రావెల కిషోరే కనిపిస్తున్నారు. మరి నిఖార్సైన జనసైనికులు ఎక్కడ. తనకు వలస నేతలు వద్దని.. తనకు కావాల్సింది యువరక్తం అని పదే పదే చెప్పిన పవన్ కల్యాణ్.. తన పార్టీ తరపున ఒక్క యువనేతను కూడా ఎందుకు ప్రొత్సహించడం లేదు. ఇతర పార్టీల్లో అవకాశాల్లేని వారంతా.. జనసేనకు వస్తూంటే ఎందుకు క్యూ కడుతున్నారు…? వారందర్నీ పవన్ ఎందుకు పార్టీలోకి తీసుకుంటున్నారు.

నైతిక విలువల గురించి ఇక లెక్చర్లివ్వకు పవన్..!

పవన్ కల్యాణ్ ఏ పుస్తకాల్లో చదవుతారో కానీ.. నైతిక విలువల గురిచి.. కొత్త రాజకీయ వ్యవస్థ గురించి అర్థం కాకుండా చెబుతారు. అర్థం కాకుండా చెప్పడం మేధావుల లక్షణం ఏమో కానీ.. ప్రజలకు మాత్రం అవేమీ అవసరం ఉండదు. చెప్పేమాటలకు.. చేసే చర్యలకు పొంతన లేకపోతే.. ప్రజలు కూడా… అంతే లైట్ తీసుకుంటారు. అందుకే..నువ్వ కూడా అధికార రాజకీయాలకే వస్తున్నానని చెప్పుకో. కొత్త రాజకీయం కాదు.. ఇప్పుడు ఉన్న చెత్త రాజకీయమే చేస్తానని అంగీకరించు. లేకపోతే.. ప్రజలు ఎవరూ దేకే పరిస్థితి ఉండదు.

——సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com