ఆ ఇంటలిజెన్స్ పోలీసును కొట్టాల్సిన అవసరం రఘురామకేంటి ?

రఘురామ కృష్ణరాజు, ఆయన కుమారుడు, పీఏతో పాటు ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపైనా హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు కేసు పెట్టారు. ఏపీ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషా వీరందరూ తనపై దాడి చేసి కొట్టారని కేసు పెట్టారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఆ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఎంపీ ఇంట్లోకి చొరబడబోతూండగా పట్టుకున్నామని సీఆర్పీఎఫ్ ఇచ్చిన ఫిర్యాదును గచ్చిబౌలి పోలీసులు పట్టించుకోలేదు.

కానీ ఇక్కడ కేసులో విచిత్రమైన కోణాలు ఉన్నాయి. తాను ఐఎస్‌బీ దగ్గర డ్యూటీ చేస్తూడంగా పట్టుకెళ్లారని ఏపీ ఇంటలిజెన్స్ పోలీసు చెబుతున్నారు. ఏపీలో డ్యూటీ చేయాల్సిన పోలీసు ఐఎస్‌బీ దగ్గర ఎందుకున్నారంటే… ప్రధాని పర్యటన కోసం వచ్చానని చెబుతున్నారు. నిజానికి ప్రధాని పర్యటన ఏపీలో ఉంది. అంతకు ముందు రోజే హైదరాబాద్లో ముగిసిపోయింది. అసలు బందోబస్తుకు ఏపీ పోలీసుల్ని పంపడం ఏప్పుడో ఆగిపోయింది. పంపినా ఏపీ ఇంటలిజెన్స్ పోలీసుల్ని పంపుతారా అనే డౌట్ మనం అడగకూడదు పోలీసులు చెప్పకూడదు.

అసలు ఆ పోలీసు ఏపీ ఇంటలిజెన్స్ పోలీసే అయితే.. ఎక్కడో ఐఎస్‌బీ దగ్గర డ్యూటీ చేస్తూంటే.. రఘురామ కానీ ఆయన టీమ్ కానీఎందుకు కిడ్నాప్ చేస్తుంది. ఆయనకేమైనా పాత గొడవలు ఉన్నాయా ? అసలు తెలిసే అవకాశం ఉందా ?చాన్సే లేదు. కానీ తనను తీసుకెళ్లారని ఆయన చెబుతున్నారు. గచ్చి బౌలి పోలీసులు నమ్మేశారు. ఎంపీనే నేరుగా దాడి చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. కేసు పెట్టేశారు. సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర జగన్ కోసం పని చేస్తున్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ కేసు చూస్తేఅలాగే ఉంది.

ఏపీ పోలీసులు కూడా ఈ అంశంపై ప్రకటన చేశారు. రఘురామ ఇంటి వద్ద ఇంటలిజెన్స్ పోలీసులను నిఘా పెట్టలేదని ఏపీ పోలీసులు ప్రకటించారు. ప్రధాని పర్యటన సందర్బంగా కానిస్టేబుల్‌ ఐఎస్‌బీ గేట్‌ వద్ద స్పాటర్‌గా ఉన్నాడని తెలిపారు. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులకు హైదరాబాద్‌లో డ్యూటీ వేసినట్లుగా ఏపీ పోలీసులు ెబుతున్నారు. కానిస్టేబుల్‌ ఫరూక్‌ విధులకు, రఘురామ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. రఘురామ ఇంటికి కిలోమీటర్‌ దూరంలో ఫరూక్‌ విధుల్లో ఉన్నాడని తెలిపారు. అక్కడ్నుంచే రఘురామ భద్రతా సిబ్బంది ఫరూక్ ను తీసుకెళ్లారని చెప్పారు. ఎందుకు తీసుకెళ్లారు అనేది మాత్రం చెప్పలేకపోయారు.. పోలీసులు అయితే మాత్రం తీసుకెళ్లి రఘురామ టీం కొడుతుందా అనే డౌట్ మాత్రం కామన్. కానీ మన దగ్గర ఎమైనా జరగొచ్చు.. కావాలనుకుంటే ఎలాంటి కేసులైనా పెట్టొచ్చని చాలా సార్లు నిరూపితమైంది. మరోసారి తెలిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిల చెప్పారు.. జగన్ చెప్పలేదు !

ఎప్పుడైనా రాఖీ పండుగ వస్తే.. వైసీపీ నేతలకు కానీ.. వైసీపీ మీడియాకు కానీ.. వారి అనుబంధ మీడియాకు కానీ జగన్- షర్మిల అనుబంధం చూపించడానికి స్పెషల్ ఎపిసోడ్లు వేసేవారు. షర్మిల,...

రివ్యూ : మాచర్ల నియోజకవర్గం

Macherla Niyojakavargam movie review telugu తెలుగు360 రేటింగ్ :1.75/5 పాండమిక్ తర్వాత థియేటర్ సినిమా ఈక్వేషన్ మొత్తం మారిపోయింది. ఎలాంటి సినిమాల‌కు ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారో తలపండిన ఇండస్ట్రీ జనాలకు కూడా...

మునుగోడులో బీసీ నినాదం !

మునుగోడు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ప్రారంభించేసరికి బీసీ నినాదం తెరపైకి వచ్చింది . ఇప్పటి వరకూప్రధాన రాజకీయపార్టీలన్నీ రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. నియోజకవర్గంలో బీసీ...

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వివేకా కేసు దర్యాప్తు – సునీత పిటిషన్ !

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుల కీలక మలుపులు తిరుగుతోంది. సీబీఐ దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని సీరయస్‌గా దర్యాప్తు చేయడం లేదని.. దర్యాప్తు అధికారులపైనే నిందితులు కేసులు పెడుతున్నారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close