కేంద్రమా..? ఏపీనా..? అప్పులపై ఎవరిది నిజం..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పులు ఎక్కువగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన నిజం. అయితే ఆ అప్పులు ఎంత అనేదానిపై.. ఎవరూ సరిగ్గా ప్రజలకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎవరి కోణాల్లో… వారు ప్రజలకు సమాచారం ఇస్తున్నారు. దాంతోనే గందరగోళం ఏర్పడుతోంది. గత ప్రభుత్వం అప్పులు ఇంత మొత్తం అని.. నిర్దిష్టంగా ప్రకటించలేదు. కానీ ఏపీ అప్పులు ఇంత మొత్తం అని ఇప్పటి కేంద్ర, రాష్ట్రాలు ప్రకటించాయి. కానీ వాటి మధ్య తేడా రూ. లక్ష కోట్లపైనే ఉంది. ఇంత తేడా ఎలా వస్తుందన్నది ఆర్థిక నిపుణులకు అర్థం కావడం లేదు.

జగన్ సర్కార్ లెక్కల్లో ఏపీ అప్పు రూ.3.62లక్షల కోట్లు..!

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రుణభారం రూ. మూడు లక్షల అరవై రెండు వేల కోట్లు ఉందని అందులో ప్రకటించారు. గత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్ ఓవర్‌ డ్రాఫ్ట్‌ మీదే బతికిందని.. పోతూపోతూ నెత్తిన అప్పును గుమ్మరించి పోయారని మండిపడ్డారు. అప్పులకు వడ్డీలు, అసలు చెల్లించుకోవడానికి ఏపీ సర్కార్ ఆదాయంలో… పది నుంచి ఇరవై శాతం పోతుందని… బుగ్గన … జగన్ సర్కార్‌లో ఆర్థిక మంత్రి అయినప్పటి నుండి ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయన అప్పుల గురించి తొలి సారి లెక్కలు బయటపెట్టారు.

కేంద్రం లెక్కల్లో ఏపీ అప్పు రూ.2,49,435 కోట్లు ..!

అయితే…కొద్ది రోజుల క్రితం.. పార్లమెంట్‌లో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల అప్పుల గురించి ప్రకటించారు. ఆ సమయంలో… ఆంధ్రప్రదేశ్ అప్పు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,49,435 కోట్లు ఉందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అప్పు అయినా కేంద్రం అనుమతితో తీసుకోవాల్సి ఉంటుంది. అప్పులు తీసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకు అప్పులు చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు.. కేంద్రం వద్ద కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఆవే కేంద్రం ప్రకటించింది.

ఎక్కువ చేసి చెబితే ఏమొస్తుంది..?

కేంద్రం ఏపీ అప్పుల గురించి పార్లమెంట్‌లో రిలీజ్ చేసిన అధికారపత్రం తో పోలిస్తే… బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి .. పెద్దగా వివరాలు లేకుండా.. విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పులు ఎందుకు ఎక్కువయ్యాయన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. అధికారపక్షం నుండి ప్రతిపక్షాన్ని విమర్శించడానికి ఇలా లెక్కలు ఎక్కువ వేసి చెబితే.. అది.. రాజకీయంగా ఉపయోగపడుతుందేమో కానీ.. ఆర్థికంగా.. ఏపీ సర్కార్‌కు ఎలాంటి ప్రయోజనాలను కల్పించదు. పైగా.. ఆర్థిక పరిస్థితిపై.. ఆర్థిక సంస్థలు అనుమానపడితే… ఇక ముందు ఎలాంటి అప్పులు పుట్టకపోవచ్చు కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం… అప్పుడు.. రూ. 3లక్షల కోట్లకుపైగానే ఉన్నాయని వాదిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close