దోచుకుంటున్నారని తిడుతున్నా.. టాలీవుడ్‌లో ఎవరికీ రోషం రావడం లేదా!?

సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాని స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకంగా స్పందించేవారే ఎక్కువగా ఉన్నారు. ఆయనపై వైసీపీ నేతలు..క్యాడర్ మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. వైసీపీ తరహా ఎదురుదాడి జరుగుతోంది. దీన్ని నాని పట్టించుకుంటారా లేదా అన్న సంగతి తర్వాత కానీ… టిక్కెట్ల వివాదంపై స్పందించడానికి మరో టాలీవుడ్ ప్రముఖుడికి మనసు రాలేదు. గతంలోప వన్ కల్యాణ్ స్పందిస్తే ఆయనను ఒంటరిని చేశారు. అప్పుడు కూడా నానిమద్దతిచ్చారు. కానీ ఇప్పుడు నాని మాట్లాడితే ఎవరూ బయటకు రావడం లేదు.

ఓ చిన్న హీరో మాట్లాడితే తాము మద్దతుగా రావడం అనేకంటే..తాము కూడా సొంతంగా గళం విప్పవచ్చు కదా అన్న ప్రశ్నలువస్తున్నాయి. టిక్కెట్ల వివాదంపై తమిళ హీరో సిద్ధార్థ స్పందించారు. నిజానికి సిద్ధార్థ తెలుగు సినిమాలు చేస్తున్నది తక్కువే.కానీ సిద్ధార్థది స్పందించే గుణం. గతంలో బీజేపీ నేతలను కూడా విమర్శించారు. ఇప్పుడు కూడా స్పందించారు. అలాంటి స్పందించే గుణం టాలీవుడ్‌లో ఇంకెవరికీ లేకుండా పోయింది. మంత్రులు బొత్స, అనిల్, కన్నబాబు లాంటి వాళ్లు టిక్కెట్ రేట్లతో దోచుకుంటున్నారని అదే పనిగా అంటున్నా ఒక్కరూ నోరు తెరవలేకపోతున్నారు.

ఇండస్ట్రీని ఇంత దారుణంగా టార్గెట్ చేస్తున్నా… ఎందుకు స్పందించలేకపోతున్నారో ఎవరికీ అర్థంకావడం లేదు. వారి ఆస్తులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలోలేదు. అయినా కానీ టాలీవుడ్ పెద్దలు ఎందుకు భయపడుతున్నారో ఎవరికీ అర్థంకావడం లేదు. ఇన్నాళ్లు తాము ఎదిగిన ఇండస్ట్రీని హీరోచితంగా కాపాడుకోకపోతే.. ఇప్పటి వరకూతెచ్చిపెట్టుకున్న హీరో ఇమేజ్‌లు ఎందుకూ పనికి రావని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

‘ప్రాజెక్ట్ కె’… రెండు భాగాలా?

ఈమ‌ధ్య పార్ట్ 2 సంస్క్రృతి బాగా ఎక్కువైంది. బాహుబ‌లి నుంచీ ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. ప్ర‌భాస్ స‌లార్ రెండు భాగాలే. పుష్ప‌, కేజీఎఫ్‌లూ బాహుబ‌లిని అనుస‌రించాయి. ఇప్పుడు కార్తికేయ రెండో భాగం రాబోతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close